Tuesday, June 22, 2021

అందరికీ కొవిడ్ టీకాలు అవసరం లేదు -వ్యాక్సిన్లపై అనుమానాలొద్దు -లోక్‌సభలో ఆరోగ్య మంత్రి ప్రకటన

National

oi-Madhu Kota

|

దేశంలో కొంత గ్యాప్ తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుండటం, వ్యాక్సిన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం, దీంతో పలు రాష్ట్రాలకు పంపిన టీకాలు వృధా అయిపోవడం, విదేశాలకు టీకాల సరఫరా లాంటి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

జగన్‌కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలు

కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. శుక్రవారంనాడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి భయం లేకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

 Every covid-19 vaccine does not require universal immunisation says Harsh Vardhan in LS

‘ప్రతి టీకాకు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ అవసరం లేదు. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తరవాత 60ఏళ్లు పైబడిన(45ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి)వారికి టీకాలు అందిస్తున్నాం. నిపుణుల సూచనల ఆధారంగా రానున్న రోజుల్లో టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం. భారతీయ నిపుణులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపాం’ అని హర్షవర్ధన్ వెల్లడించారు. అలాగే..

మమత పెద్ద రిగ్గింగ్ రారాణి -ఈవీఎం యంత్రాలపై సాకులా? -బెంగాల్ సీఎంపై బీజేపీ నేత సువేందు ఫైర్

వైద్య నిపుణులు చెప్పిన సూచనలు ప్రకారం..దేశంలో ప్రతి ఒక్కరికి టీకాలు ఇవ్వాల్సిన పని లేదని, ప్రపంచ వ్యాప్తంగా కూడా. వైరస్ తీరును బట్టి..టీకా కార్యక్రమంలో మార్పులు ఉంటాయని, ప్రతి ఒక్కరు టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి అన్నారు. దేశంలో ఇంతవరకూ 3,93,39,817 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్టు హర్షవర్ధన్ తెలిపారు. భారత్ అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే విదేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

కాగా, గత 24 గంటల్లో కొత్తగా 39,726 కరోనా కేసులు నమోదు కాగా, 20,654 మందికి స్వస్థత చేకూరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ప్రకటించింది. కొత్తగా వెలుగుచూసిన కోవిడ్ కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కు చేరుకుంది. వీటిలో 2,71,282 యాక్టివ్ కేసులుండగా, 1,10,83,679 మంది కోలుకున్నారు.


Source link

MORE Articles

Clubhouse is building a DM text chat feature – TechCrunch

Some Clubhouse users were treated to a surprise feature in their favorite app, but it wasn’t long for this world. A new UI...

HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models; terms of the deal were...

Kyle Wiggers / VentureBeat: HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models;...

టీఆర్ఎస్‌లోకి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు… హుజురాబాద్ ఉపఎన్నికవేళ మారుతున్న రాజకీయం…

హుజురాబాద్‌లో గెలుపు టీఆర్ఎస్‌దే -హరీశ్ రావు మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... హుజురాబాద్‌ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారని అన్నారు. 2001 నుంచి హుజురాబాద్‌...

हाई ब्लड प्रेशर को कंट्रोल में रखेंगी ये चीजें, हार्ट अटैक का खतरा भी होगा कम, डॉक्टर ने बताया सेवन करने का सही तरीका

नई दिल्ली: हार्ट अटैक एक ऐसी स्थिति है, जिसमें जान बचाना बेहद मुश्किल हो जाता है. इसकी सबसे बड़ी वजह अनियंत्रित हाई ब्लड...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe