Tuesday, May 17, 2022

అజిత్ దోవల్ రహస్య మంతనాలు -భారత్, పాకిస్తాన్ సైన్యాల కీలక నిర్ణయం -ఇకపై సరిహద్దులో..

భారత్-పాక్ కీలక అంగీకారం..

దాయాదులుగా ఉన్న భారత్, పాకిస్తాన్ దేశాలు మరోమారు శాంతి బాటను పట్టాయి. రెండు దేశాల సైన్యాలు గురువారం ఓ సంచలన నిర్ణయానికి వచ్చాయి. జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. అలాగే, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా ఎలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వరాదని నిర్ణయించుకున్నాయి. ఎల్ఓసీ వెంబడి తరచూ కాల్పులు జరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన కూడా జారీ అయింది..

అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

‘‘ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.” అని ఇరు దేశాల అధికారులు గురువారం ఒక ప్రకటన చేశారు. తాజాగా కుదిరిన అంగీకారంతో ఈనెల 24(బుధవారం) అర్ధరాత్రి నుంచి సరిహద్దుకు రెండు వైపులా కాల్పులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, పరస్పర అంగీకారం కుదిరినప్పటికీ, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంటాయని, అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే మోహరింపు కొనసాగింస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా,

 అజిత్ దోవల్ రహస్య మంతనాలు..

అజిత్ దోవల్ రహస్య మంతనాలు..

ముంబై ఉగ్రదాడులతో దెబ్బ తిన్న భారత్, పాక్ సంబంధాలు.. ఉరి ఉగ్రదాడి, పుల్వామా దాడి తర్వాత పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్ కు కల్పించిన అన్ని ప్రయారిటీలను రద్దు చేసిన భారత్.. అంతర్జాతీయంగా దాని తీరును ఎండగట్టింది. ఈక్రమంలో సరిహద్దు వద్ద హింస నానాటికీ తీవ్రతరం అవుతూ వచచింది. ఈ నేపథ్యంలో హింసను నివారించే దిశగా, 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందం పక్కాగా అమలయ్యేలా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. పాకిస్తాన్ తో రహస్య మతనాలు చేశారని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపారని, ఆయన కృషి వల్లే రెండు దేశాల సైన్యాలు గురువారం నాటి ప్రకటనను వెలువరించాయిని తెలుస్తోంది. దోవల్ సీక్రెట్ టాక్స్ ముచ్చట ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్‌ లాంటి అతి కొద్ది మందికే తెలుసని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe