[ad_1]
News
oi-Kannaiah
అదానీ గ్రూపులకు ఆయా బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పటికి కూడా… దేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థను లాభదాయకం అని సూచించే పలు పారామీటర్లు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.ముఖ్యంగా అసెట్ క్వాలీటీ,లిక్విడిటీ లాంటి సూచికల ప్రదర్శన మెరుగ్గా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.అదాని గ్రూప్స్ కుదుపుతో అప్రమత్తమైన ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థను చాలా దగ్గరగా సమీక్షిస్తోంది.అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకుంటోందిన స్పష్టం చేసింది.
అదానీ గ్రూపులకు పలు బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు అనేక కోణాల్లో కథనాలు ప్రచురించాయి. దీంతో స్వయంగా ఆర్బీఐ రంగంలోకి దిగి భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పింది. అయితే ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించకుండా ఆర్బీఐ చెప్పాల్సింది చెప్పేసి.. క్లారిటీ ఇచ్చేసింది. ఏ బ్యాంకులైతే రూ.5 కోట్ల కంటే భారీ రుణాలు ఇస్తుందో అలాంటి సమాచారం మొత్తం ఆర్బీఐ మెయిన్‌టెయిన్ చేస్తుంది.దీన్నే సెంట్రల్ రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (CRILC) అని అంటారు.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్స్‌పై ఇచ్చిన నివేదికతో అదానీ స్టాక్స్ విలువ మార్కెట్ విలువ కంటే సగానికి పైగా నష్టాల్లోకి వెళ్లాయి. అయితే హిండెన్ బర్గ్ వెల్లడించిన రిపోర్టు సత్యదూరమని చెబుతూ ఆ నివేదికను అదానీ సంస్థ ఖండించింది.కేవలం భారత మార్కెట్లపై దాడి చేసి ఆర్థికంగా హిడెన్‌బర్గ్ సంస్థ లాభపడేందుకు చేసిన కుట్రగా అదానీ సంస్థ అభివర్ణించింది.ఇదిలా ఉంటే ఎఫ్‌పీఓలను కూడా తిరిగి చెల్లించేందుకు అదానీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ కుదుపుల నేపథ్యంలో ముందుకు కొనసాగారాదని,ఎఫ్‌పీఓలను తిరిగి పెట్టుబడిదారులకు చెల్లించాలని అదానీ సంస్థ నిర్ణయించుకుందంటూ వెల్లడించింది.
English summary
RBI says the all the parameters in the banking sector are stable amid the adani stocks rout
RBI says the banking sector is safe and stable amid the adani stocks rout.
Story first published: Saturday, February 4, 2023, 13:12 [IST]
[ad_2]
Source link
Leave a Reply