Saturday, July 24, 2021

అది కూడా తెలియదా?: రాహుల్ వ్యాఖ్యలతో షాకయ్యానంటూ ప్రధాని మోడీ సెటైర్లు

రాహుల్ వ్యాఖ్యలు ఆశ్చర్యపోయానంటూ మోడీ

‘ఓ కాంగ్రెస్ నేత కేంద్రంలో మత్స్యశాఖ లేదంటూ వ్యాఖ్యలు చేయడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, అసలు నిజం ఏంటంటే.. ఇప్పటికే కేంద్రంలో ఆ శాఖ ఉంది. 2019లోనే కేంద్రంలో మత్స్యశాఖను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోడీ. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గురువారం పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోడీ. త్వరలో(ఏప్రిల్-మే)నే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు.

డివైడ్, లై, రూల్.. ఇదే కాంగ్రెస్ పాలసీ

డివైడ్, లై, రూల్.. ఇదే కాంగ్రెస్ పాలసీ

గతంలో భారత ప్రభుత్వాన్ని బిట్రీష్ ప్రభుత్వంతో పోల్చడాన్ని ఈ సందర్భంగా ఖండించారు. బ్రిటీష్ పరిపాలకులు డివైడ్ అండ్ రూల్(విభజించి పాలించు) పాలసీని అమలు చేస్తే.. కాంగ్రెస్ మాత్రం డివైడ్, లై, రూల్(విభజించు, అబద్ధాలు, పాలించు) పాలసీని అమలు చేస్తోందని మోడీ విమర్శించారు. అప్పుడు ఆ పార్టీ నేతలు ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చులుపెడతారని మండిపడ్డారు.

మత్స్యశాఖకు మంత్రిని నేనంటూ రాహుల్‌కు గిరిరాజ్ సింగ్ కౌంటర్

మత్స్యశాఖకు మంత్రిని నేనంటూ రాహుల్‌కు గిరిరాజ్ సింగ్ కౌంటర్

ఫిబ్రవరి 17న పుదుచ్చేరిలో పర్యటించిన రాహుల్ గాంధీ.. ఇక్కడి మత్స్యకారులతో మాట్లాడుతూ.. కేంద్రంలో మత్య్సశాఖ లేదని, తాము అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామని చెప్పడం గమనార్హం. దీంతో ఆ వెంటనే కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఇతర బీజేపీ నేతలు రాహుల్ గాంధీకి కౌంటర్లు ఇచ్చారు. కేంద్రంలో మత్య్సశాఖ ఉన్న విషయం కూడా రాహుల్‌కు తెలియదా? అని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ తాజాగా, కేరళ పర్యటనలో కూడా రాహుల్ అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నార్త్, సౌత్ అంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు

నార్త్, సౌత్ అంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్రంలో మత్స్యశాఖ లేదని, తాము ఏర్పాటు చేస్తామని కేరళ ప్రచారంలో కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేగాక, నార్త్, సౌత్ ఇండియా అంటూ వ్యాఖ్యలు చేయడం వివాస్పదమయ్యాయి. తాను 15ఏళ్లపాటు ఉత్తర భారతదేశంలో ఎంపీగా ఉన్నానని, అక్కడి రాజకీయాలు వేరుగా ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాను తొలిసారిగా సౌత్ ఇండియా నుంచి ఎంపీగా ఎన్నికయ్యానని, ఇక్కడి ప్రజలు ఎంతో విజ్ఞానవంతులుగా కనిపిస్తున్నారని, సమస్యల పట్ల వారికి అవగాన ఉందని చెప్పుకొచ్చారు.


Source link

MORE Articles

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe