అనిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.. హీరో ఎవరంటే..?

Date:

Share post:


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి1కి ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్క కమర్షియల్ డైరెక్టర్గా.. తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. ఎలాంటి స్టోరీ నైనా కమర్షియల్‌గా రూపొందించి తన మార్క్ ఎంటర్టైన్మెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకోగలడు. ఈ క్రమంలోనే.. ఆయన ఇప్పటివరకు తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు. పటాస్‌, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 , భ‌గవంత్ కేస‌రి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా అన్ని సినిమాల్లో యాక్షన్ తో పాటు,, తన స్టైల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సినిమాలతో సక్సెస్ కొడుతూ వస్తున్నాడు, తెరపై పాత్రలను మలిచే తీరుతో ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు.

ఇప్పటివరకు దాదాపు ఓకే జానర్లో అన్ని సినిమాలు చేసినా ఒక‌ ఫ్లాప్ అన్నదే లేదు. అయితే.. అభిమానుల్లో మాత్రం ఎప్పుడూ ఒకే జోనెర్ కాకుండా.. దాని నుంచి బయటకు వచ్చి.. ఓ కొత్త జోనర్‌లో అనిల్ ఎప్పుడు బూవీ తీస్తాడు అనే సందేహాలు ఉంటాయి. అయితే.. దీనిపై అనిల్ రియాక్షన్ ఇదే. అనిల్ కు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందట. ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో ఓ థ్రిల‌ర్ స్టోరీ చేయాలనుకుంటున్నాడట. ఎప్పటినుంచో అయనా మనసులో కోరిక ఇది. డైరెక్టర్ కాకముందు నుంచే ఈ సినిమా తీయాలని భావిస్తున్నట్లు ఆయ‌న‌ స్వయంగా వెల్లడించాడు. ఒకవేళ ఆయన సోషియా ఫాంటసీ టచ్ చేసిన కూడా అందులో తన మార్క్ కామెడీని మాత్రం ప‌క్కా అనడంలో సందేహం లేదు.

Director Anil Ravipudi Celebrates a Decade of Success in Telugu Cinema

ఫాంటసీ డ్రామాలు కూడా చాలా కాలం నుంచి వెండి తెర‌పై కనిపించిందే లేదు. అయితే.. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభ‌ర‌తో సోషియా ఫాంట‌సీ డ్రామాలు కనిపించనున్న సంగతి తెలిసిందే. జగదేక‌వీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరు నటిస్తున్న మరో ఫాంటసీ డ్రామా ఇది. ఇక గతంలో చిరు, బాలయ్య, వెంకటేష్ ఇలాంటి సోషియా ఫాంటసీ థ్రిల్లర్లలో ఎక్కువగానే నటించారు. ఇలాంటి క్రమంలోనే ఒకవేళ అనిల్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తే మాత్రం.. ఈ సోషియా ఫాంటసీ థ్రిల‌ర్‌ డ్రామా కోసం ఆయన సీనియర్ హీరోని ఎంచుకుంటాడా.. లేదా.. ఈ జనరేషన్ హీరోలను సెలెక్ట్ చేసుకుంటాడా.. అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక అనీల్ ప్రస్తుతం చిరంజీవి ఒక కామెడీ ఎంటర్టైన‌ర్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...

హీరో కాక‌పోతే క‌చ్చితంగా అదే చేసేవాడ్ని: మంచు విష్ణు

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. 1985లో విడుదలైన `రగిలే గుండెలు` సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా...