[ad_1]
RBI Repo rate increased: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరోసారి రెపోరేట్లు పెంచింది. 35 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నామని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ బుధవారం పేర్కొంది. మొత్తంగా వడ్డీరేటును 6.25 శాతానికి చేర్చింది. పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు.
రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం ఇదే మొదటి సారేమీ కాదు. మే నెలలో మొదటి సారి 40 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్, ఆగస్టు, సెప్టెంబర్లో వరుసగా 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మొత్తంగా ఆర్బీఐ పాలసీ రేటు 2018, ఆగస్టు నాటి అత్యధిస్థాయి 6.25 శాతానికి చేరుకుంది.
[ad_2]
Source link