Tuesday, September 21, 2021

అఫ్గానిస్తాన్: మూడు నగరాల్లో భీకర కాల్పులు, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న తాలిబాన్లు

India

-BBC Telugu

By BBC News తెలుగు

|

అఫ్గానిస్తాన్

అఫ్గానిస్తాన్‌లో మూడు ప్రధాన నగరాలను ప్రభుత్వ బలగాల నుంచి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబాన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

హెరాత్, లష్కర్ గాహ్, కాందహార్‌లలో ఆదివారం కూడా విధ్వంసకర ఘర్షణలు చెలరేగాయి.

సెప్టెంబర్ నాటికి దాదాపు అన్ని విదేశీ దళాలు ఆ ప్రాంతాలను ఖాళీ చేస్తాయని ప్రకటించినప్పటి నుంచి తాలిబన్లు గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం అయ్యారు.

ప్రభుత్వ దళాలు ఎంతకాలం తమ పట్టు నిలుపుకుంటాయనే అంశంపై ఈ మూడు కీలక నగరాల భవితవ్యం ఆధారపడి ఉంది.

అఫ్గాన్‌ భూభాగంలోని సగం ఇప్పటికే తాలిబాన్ల పరమైనట్లు భావిస్తున్నారు. ఇరాన్, పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాలు కూడా వారి వశమయ్యాయి. అయితే, దేశ రాజధాని మాత్రం ఇంకా వారికి చాలా దూరంలోనే ఉంది.

కాందహార్‌లో వేలమంది నిరాశ్రయులయ్యారు

లష్కర్ గాహ్‌లో భీకర కాల్పులు

లష్కర్ గాహ్ నగరంలో ప్రభుత్వ బలగాలు, తాలిబాన్ల మధ్య భీకర ఘర్షణలు ఆదివారం కూడా కొనసాగాయి.

శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి కేవలం కొన్ని వందల కి.మీ. దూరానికి తాలిబాన్లు వచ్చేశారు. అయితే, ఉదయానికల్లా వారిని మళ్లీ ప్రభుత్వ బలగాలు వెనక్కి వెళ్లేలా చేశాయి.

తాలిబాన్లే లక్ష్యంగా అఫ్గాన్, అమెరికా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. వీటిలో డజన్ల మంది తాలిబాన్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

”తాలిబాన్లకు మాపై దయలేదు. ప్రభుత్వం కూడా బాంబులు వేయడం ఆపడం లేదు”అని లష్కర్ గాహ్‌లో ఉండే హలీమ్ కరీమీ వ్యాఖ్యానించారు.

హెరాత్‌లో కొనసాగుతున్న ఘర్షణ

కాందహార్‌కు చెందిన ఒక ఎంపీ బీబీసీతో మాట్లాడుతూ ‘నగరం అత్యంత ప్రమాదంలో ఉంది. ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులయ్యారు. మానవతా విపత్తు పొంచి ఉంది’ అని చెప్పారు.

గంట గంటకూ పరిస్థితి చేజారిపోతోందని గుల్ అహ్మద్ కమీన్ తెలిపారు. నగరంలో జరుగుతోన్న పోరాటం గత 20 ఏళ్లలో అత్యంత తీవ్రమైనదని అన్నారు.

‘తాలిబన్లు కాందహార్‌ను కేంద్ర బిందువుగా భావిస్తున్నారు. దీన్ని వారి తాత్కాలిక రాజధానిగా మార్చాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ నగరం వారి ఆధీనంలోకి వెళ్లిపోతే దీనితో పాటు 5 లేదా 6 ప్రావిన్సులను కూడా కోల్పోవాల్సి వస్తుంది’ అని కమీన్ వెల్లడించారు.

‘నగరంలో అన్ని వైపులా తాలిబన్లు ఉన్నారు. ఒకవేళ వారు లోపలికి చొరబడితే, నగరంలో జనాభా భారీగా ఉండడం వల్ల ప్రభుత్వ బలగాలు భారీ ఆయుధాలను ఉపయోగించలేవు’ అని చెప్పారు.

హెరాత్‌లో ఘర్షణలు తీవ్రతరం అయ్యాయని టోలో న్యూస్ రిపోర్టర్ వెల్లడించారు. నగరంలోని దక్షిణ ప్రాంతాల్లోకి తాలిబన్లు ప్రవేశించారని చెప్పారు.

మ్యాప్

కనీసం 5 వేర్వేరు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అఫ్గాన్ బలగాలకు మద్దతుగా అమెరికా వైమానిక దాడులు చేస్తోంది.

విమానాశ్రయం సమీపంలోని యూఎన్ కాంపౌండ్‌కు కాపలా ఉన్న గార్డు శుక్రవారం హత్యకు గురయ్యారు. దీన్ని ఉద్దేశపూర్వక తాలిబన్ల దాడిగా అమెరికా పేర్కొంది.

నగరంలోని కొన్ని ప్రాంతాలు సురక్షితంగా ఉన్నట్లు అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. తమని తాము రక్షించుకునేందుకు ఆయుధాలను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.

తిరుగుబాటుదారులు దక్షిణ ప్రావిన్స్ హెల్మండ్ రాజధాని లష్కర్ గాహ్‌లో సిటీ సెంటర్‌కు కేవలం 2 కి.మీ దూరంలోకి చేరుకున్నారు. అయితే వారిని తిప్పికొట్టడంలో ప్రభుత్వ దళాలు సఫలమయ్యాయి.

తీవ్రవాదులకు భారీ ప్రాణనష్టం జరిగిందని అఫ్గాన్ దళాల కమాండర్ చెప్పారు.

తాలిబన్లు శుక్రవారం గవర్నర్ కార్యాలయానికి చేరువగా వచ్చినట్లు స్థానికులు బీబీసీతో చెప్పారు. వారిని ప్రభుత్వ దళాలు తిప్పికొట్టాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary

Afghanistan: Fierce gunfire in three cities, Taliban trying to take control




Source link

MORE Articles

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Microsoft Surface Duo 2 mini-tablet updated features revealed in FCC filing

Something to look forward to: As Microsoft prepares to talk about...

Astronomers finally solve the mystery of a famous 900-year-old Chinese supernova

A 900-year-old mystery has finally been solved as an international team of astronomers say they have identified the source of a famous supernova...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe