Friday, June 18, 2021

అభిమానుల అత్యుత్సాహం… కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్.. ప్రచారానికి బ్రేక్…

National

oi-Srinivas Mittapalli

|

అభిమానుల అత్యుత్సాహంతో మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ గాయపడ్డారు. అంతా ఒక్కసారిగా మీదపడి ఆయన కుడి కాలిని తొక్కేశారు. దీంతో తీవ్రమైన నొప్పితో కమల్ హాసన్ హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కోయంబత్తూర్‌లో శనివారం(మార్చి 20) ఉదయం కమల్ హాసన్ మార్నింగ్ వాక్‌కి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆస్పత్రిలో ఆయన కాలికి స్కానింగ్ చేసిన వైద్యులు కంగారుపడాల్సిందేమీ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో కుడి కాలి ఎముకలో ఇన్ఫెక్షన్‌తో కమల్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేశారు. తాజాగా అదే కాలికి గాయం కావడంతో ఆయన నొప్పితో విలవిల్లాడారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నేతలు వెల్లడించారు. దీంతో కమల్ హాసన్ క్యాంపెయిన్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.

Makkal Needhi Maiam chief Kamal Haasan suffers leg pain after fans stamped

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీరోజూ స్థానికులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లడమే ఆలస్యం వందలాది మంది అభిమానులు ఆయన్ను చుట్టుముడుతున్నారు. తాజాగా మార్నింగ్ వాక్‌కి వెళ్లిన సమయంలోనూ ఇదే జరిగింది. అభిమానులంతా ఒక్కసారిగా చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడటంతో ఆయన కాలికి గాయమైంది.

కాగా,. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనుంది. మిగతా 80 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి. ఇందులో ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి(IJK),ఇంధియా జననాయగ కచ్చి(AISMK) పార్టీలు చెరో 40 స్థానాలను పంచుకోనున్నాయి. యూపీఏ,ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ఐజేకె,ఏఐఎస్ఎంకెలతో కలిసి కమల్ హాసన్ ఈ థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ… ఒక్క స్థానంలో కూడా మక్కల్ నీది మయ్యం గెలవలేకపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ రెండు,మూడు స్థానాలకు మించి గెలవలేదని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. మరోవైపు కమల్ హాసన్ మాత్రం ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం చూపిస్తుందన్న ధీమాతో ఉన్నారు.


Source link

MORE Articles

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe