Thursday, May 12, 2022

అమెరికాను దాటేస్తుందేమో అన్న దశ నుంచి… కరోనాతో సమర్థవంతంగా ఫైట్.. భారత్‌కు ఎలా సాధ్యపడింది?

హ్యూమన్ బారికేడ్…

భారత్‌ కరోనా వ్యాప్తిని ఇంత సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కారణం ‘హ్యూమన్ బారికేడ్’ అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌కి చెందిన ఎపిడిమిలాజిస్ట్ భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు. కొంతమంది పరిశోధక బృందంతో కలిసి భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఆమె అధ్యయనం చేస్తున్నారు.భారత్‌లో ఈ ఏడాది మార్చి చివరి నాటికి కరోనా వ్యాప్తిలో స్థిరమైన తగ్గుదల నమోదవుతుందన్నారు.న్యూఢిల్లీ,వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్,ఎకనమిక్స్&పాలసీ పరిశోధనా సంస్థకి చెందిన ఎపిడిమిలాజిస్ట్ రామణన్ లక్ష్మీనారాయణ్ మాట్లాడుతూ… ఒకానొక దశలో భారత్ కరోనా వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నదని చెప్పారు. కానీ ఇప్పుడు మరో దశలోకి భారత్ ప్రవేశించిందన్నారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని తాను భావించట్లేదని… ఒకవేళ వచ్చినా దాని తీవ్రత మామూలుగానే ఉంటుందని తెలిపారు.

ఇవీ కారణాలు...

ఇవీ కారణాలు…

ఇటీవలి సీరోలాజికల్ సర్వేలో 21.5శాతం మంది భారతీయులు ఇప్పటికే కరోనా బారినపడి ఉండొచ్చునని వెల్లడైంది. అదే సమయంలో మరో డయాగ్నోస్టిక్ కంపెనీ చేపట్టిన యాంటీబాడీ టెస్టుల్లో 55శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు తేలింది. భారత జనాభాలో యువత ఎక్కువగా ఉండటం… ఆదిలోనే కరోనా కట్టడికి లాక్‌డౌన్ వంటి చర్యలు చేపట్టడం,ఎక్కువమందిలో అంతర్గత రోగ నిరోధక శక్తి మెండుగా ఉండటం కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చురుగ్గా చేపడితే భారత్ ఇంకా మెరుగైన స్థితికి చేరుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని,మరింత అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చునని అంటున్నారు.

ఆ రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు...

ఆ రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఆ సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో ముంబై లాంటి నగరాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనే 70శాతం కేసులు ఉండటం గమనార్హం. ఇటీవల కేరళలో స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు చెప్తున్నారు. ముంబైలో లోకల్ ట్రైన్స్‌ను పునరుద్దరించడం అక్కడ కేసుల సంఖ్య పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు మళ్లీ కట్టుదిట్టమైన చర్యలపై ఫోకస్ చేశాయి.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe