Saturday, May 8, 2021

అమ్మను చూసేందుకు సుప్రీం అనుమతి -కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌కు 5రోజుల బెయిల్ -యూపీ పోలీస్ కట్టడి

National

oi-Madhu Kota

|

అనారోగ్యంతో బాధపడుతూ, మరణానికి చేరువైన 90 ఏళ్ల ముసలి తల్లిని ఒక్కసారి చూసొస్తానంటూ వేడుకొన్న కొడుకును భారత సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు కనికరించింది. నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణలో ఆరు వాయిదాల తర్వాతగానీ సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఆ జర్నలిస్టు కొడుక్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరణశయ్యపై ఉన్న అమ్మను కలిసొచ్చేందుకుగానూ కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌కు ఐదు రోజుల బెయిల్ లభించింది. ఈ మేరకు..

వేదికపై కుప్పకూలిన సీఎంకు కరోనా పాజిటివ్ -స్థానిక ఎన్నికల్లో కొవిడ్ రూల్స్ పాటించని రూపానీ

సిద్ధిక్ కప్పన్ తల్లి చావుబతుకుల్లో ఉన్నందున ఆమెను కలిసేందుకుగానూ అతనికి ఐదు రోజుల బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కెయుడబ్ల్యుజె) మూడు వారాల కిందట దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసం ఎట్టకేలకు సోమవారం విచారించింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కప్పన్ కు ఐదు రోజుల బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. అయితే..

SC grants 5 Days interim bail to Kerala Journalist Siddique Kappan to visit ailing mother

కోర్టులో బోరుమన్న దిశ రవి -గ్రెటా ‘టూల్ కిట్’ కేసులో 5రోజుల రిమాండ్ -భారీ మద్దతు -అసలేంటీ కేసు?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మధుర జైలులో ఉన్న సిద్ధిక్ కప్పన్ కేరళ వెళ్లి, తల్లిని చూసి తిరిగొచ్చేంత వరకూ పోలీసుల కట్టడిలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. యూపీ పోలీసుల టీమ్ ఒకటి ఈ ఐదు రోజులపాటూ కప్పన్ వెన్నంటి ఉంటుందని, బెయిల్ గడువులో ఆయన మీడియాతోగానీ, బయటి వ్యక్తులతోగానీ మాట్లాడరాదని సీజేఐ బెంచ్ ఆంక్షలు విధించింది. అయితే, సిద్ధిక్ తన తల్లితో మాట్లాడేటప్పుడు మాత్రం పోలీసులు ఆ గదిలో ఉండరాదని కోర్టు నిర్దేశించింది. డాక్టర్లు, భార్యాబిడ్డలతో మాత్రం సిద్ధిక్ మాట్లాడొచ్చని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఢిల్లీకి చెందిన పాత్రికేయుడు, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కెయుడబ్ల్యుజె) ఢిల్లీ యూనిట్ కార్యదర్శి అయిన సిద్దిక్ కప్పన్ మలయాళ పోర్టల్ ‘అజీముఖం’ లో పనిచేసేవారు. గతేడాది సెప్టెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో దళిత యువతి గ్యాంగ్ రేప్, హత్యాకాండ ఘటనను కవర్ చేయడానికి వెళుతోన్న ఆయనతోపాటు మరో ముగ్గురిని యూపీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం మధుర జైలులో ఉన్న సిద్దిక్ పై తీవ్రవాద కలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)తోపాటు దేశద్రోహం అభియోగాలు కూడా నమోదయ్యాయి. విచారణకు సహకరిస్తానంటూనే.. ఒక్క సారి తల్లిని చూస్తానంటూ సిద్దిక్ విన్నవించుకోగా.. నాలుగు నెలల తర్వాతగానీ బెయిల్ లభించలేదు. నిజానికి..

SC grants 5 Days interim bail to Kerala Journalist Siddique Kappan to visit ailing mother

సిద్ధిక్ కప్పన్ తల్లి పరిస్థితిపై ఆరా తీసిన సుప్రీంకోర్టు.. జనవరి 22న.. నిందితుడు ఆమెతో మాట్లాడేందుకుగానూ 5నిమిషాల వీడియో కాల్ కు అనుమతించ్చింది. కానీ వీడియో కాల్ చేసిన సమయంలో ఆమె దాదాపు అపస్మారక స్థితిలో ఉండటంతో కొడుకును గుర్తుపట్టలేకపోయారు. పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమె.. మెలకువ వచ్చినప్పుడల్లా కొడుకును చూస్తానని అడుగుతోన్నట్లు న్యాయవాది చెబుతున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అర్నబ్ గోస్వామి లాంటి జర్నలిస్టులకు తీవ్రమైన కేసుల్లోనూ ఆఘమేఘాల మీద బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. కప్పన్ లాంటి సాదాసీదా జర్నలిస్టుల విషయంలో వ్యత్యాసం చూపుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతుండం తెలిసిందే.


Source link

MORE Articles

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు, కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్..కారణం ఇదే !!

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా...

कब खत्म होगी कोरोना की दूसरी लहर? वैज्ञानिकों ने बताया सही टाइम…जानें

नई दिल्ली: इस वक्त कोरोना की दूसरी लहर ने देश में कोहराम मचा रखा है. रोजाना रिकॉर्ड मामले सामने आ रहे हैं. हजारों...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe