మళ్ళీ 60 వేలకు బంగారం ధర చేరుకునే అవకాశం

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగాను బంగారం ధరలలో హెచ్చుతగ్గులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ బంగారం ధరలు 60 వేలకు చేరుకుంటాయన్న భావన కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకం విలువ మార్పు, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, అంతర్జాతీయంగా బంగారం నిల్వలు ఇలా అనేక అంశాలు బంగారం పెరుగుదలకు కారణంగా మారుతున్నాయి.

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

ఇక తాజాగా నేడు బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో నిన్న 53, 150 రూపాయలుగా విక్రయమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గి 53,050 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,980గా నిన్న ట్రేడ్ కాగా నేడు 57,870లుగా కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే స్వచ్ఛమైన బంగారం మీద 110 రూపాయలు బంగారం ధర నేడు తగినట్టు కనిపిస్తుంది.

 ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 53,300గా ట్రేడ్ కాగా నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,200గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 58 వేల 130 రూపాయలుగా విక్రయం కాగా నేడు 58,020 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,150 రూపాయలుగా కొనసాగితే, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,050 ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబైలో నిన్న 57,980గా ట్రేడ్ కాగా నేడు 57,870 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

విజయవాడ, విశాఖలతో పాటు బెంగళూరు, చెన్నైలలో బంగారం ధరలిలా

విజయవాడ, విశాఖలతో పాటు బెంగళూరు, చెన్నైలలో బంగారం ధరలిలా

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53, 050 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,870 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,100 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బెంగుళూరులో 57,920 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక దేశంలోనే బంగారం ధరలలో అత్యధికంగా ధరలు ఉండే చెన్నై, మధురై, కోయంబత్తూరులలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 53,800 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 58,690 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *