Tuesday, April 13, 2021

అరకు లోయలో పడిన టూరిస్ట్ బస్సు: 8 మంది మృతి, 25 మందికి గాయాలు, అంతా హైదరాబాద్ వాసులే

Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

విశాఖపట్నం: జిల్లాలోని అనంతగిరి మండలం డముకులో శుక్రవారం పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. అరకు డముకు ఘాట్ రోడ్డులోని ఐదో నెంబర్ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఓ చిన్నారితోపాటు 8 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలిసింది. మృతులంతా హైదరాబాద్ వాసులేనని గుర్తింపు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది సంఘటా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.

A tourist bus accident in Araku in visakhapatnam district

లోయలోపడిన బస్సును గుర్తించిన సహాయక చర్యలు చేపడుతున్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందిగా మారింది. కాగా, ప్రమాదంలో గాయపడిన 25 మందిని అనంతగిరి, కేజీహెచ్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

A tourist bus accident in Araku in visakhapatnam district

బస్సు లోయలోకి పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి అరకు వచ్చి, తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా బస్సు బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.

ఘటనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Source link

MORE Articles

HomeX, which pairs service workers with homeowners and uses AI to diagnose home-related issues, raises $90M, says number of contractors on HomeX rose 5x...

Mary Ann Azevedo / TechCrunch: HomeX, which pairs service workers with homeowners and uses AI to diagnose home-related issues, raises $90M, says number...

Coronavirus छूने से नहीं फैलता, US की नई रिसर्च में दावा

वाशिंगटन: साल 2021 में जब कोरोना वायरस (Coronavirus) बहुत तेजी से फैल रहा था, तब हालत ये थी कि कुछ भी छूने से...

భారత్‌లో విలయం: Sputnik V రాకతో భరోసా? -రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత ఎంత? -కీలక అంశాలివే

భారత్‌లో మూడో వ్యాక్సిన్.. మన దేశంలో కొవిడ్ కేసులకు సంబంధించి అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను వాడుతున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన అందరికీ టీకాలను...

ఏపీలో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 4,228 కొత్త కేసులు ,10 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి , మొత్తం కేసుల సంఖ్య 9,32,892 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నమోదైన మొత్తం కేసులతో కలిపి...

Taiwan’s AppWorks leads $1m round in Vietnam healthtech startup

Docosan says it has helped 50,000 patients book appointments with doctors across 35 specialties within less than a year of operations. Source link

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ .. నేడు మార్గదర్శకాలు, నిబంధనలు వెల్లడించనున్న మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే !!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రకటన కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రయత్నిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన నిబంధనలను, మార్గదర్శకాలను ప్రకటించడానికి...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe