Saturday, July 24, 2021

అలాంటి వ్యూహాలు భారత్ ముందు కుదరవు… చైనాపై ఆర్మీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు…

National

oi-Srinivas Mittapalli

|

ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా,ప్రాణనష్టం జరగకుండా తమ విస్తరణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనే చైనా లక్ష్యం,వ్యూహం భారత్ ముందు పనిచేయవని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అన్నారు. సరిహద్దులో ‘స్టేటస్ కో’ని కొద్ది కొద్దిగా మారుస్తూ ముందుకెళ్లే వ్యూహం చైనాకు అలవాటని… తద్వారా ప్రత్యర్థి నుంచి పెద్దగా రియాక్షన్ ఉండదని డ్రాగన్ కంట్రీ భావిస్తుందన్నారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద జలభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుందన్నారు. అయితే భారత్‌తో అలాంటి వ్యూహాలు కుదరవని అన్నారు. చైనా ప్రతీ చర్యకు భారత్ నుంచి గట్టి రియాక్షన్ ఉంటుందన్నారు. బుధవారం(ఫిబ్రవరి 24) వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన వెబినార్‌లో నరవణే మాట్లాడారు.

‘ప్రస్తుతం సరిహద్దులో భారత్-చైనా సైనిక బలగాల ఉపసంహరణ శుభ పరిణామం. ఇది ఇరువురికి విన్-విన్ సిచ్యుయేషన్ అని చెప్పవచ్చు. ఏ ఒప్పందానికైనా ఇరు వర్గాలకు తామేదో సాధిస్తున్నామనే భావన కలగాలి. ఆ లెక్కన ఇప్పుడు జరుగుతున్న సైనిక ఉపసంహరణ మంచి పరిణామమే.’ అని నరవణే అభిప్రాయపడ్డారు.

ఇటీవలే ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి మొదటి దశ సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన సంగతి తెలిసిందే. దెస్పాంగ్,గోగ్రా పోస్ట్,హాట్ స్పింగ్ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఇంకా చేపట్టాల్సి ఉంది. అందుకోసం భారత్‌కు తమవైన కొన్ని వ్యూహాలు ఉన్నాయని నరవణే తెలిపారు. అత్యంత కఠినమైన చలి వాతావరణంలోనూ తూర్పు లదాఖ్‌లో చైనాను ఎదుర్కొన్న భారత సైనికులను ఆయన అభినందించారు. సరిహద్దులో ఇంకా డీ-ఎస్కలేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని… దానికి ఇంకా చాలా సమయం పడుతుందని అన్నారు.

కాగా,దాదాపు 9 నెలలుగా భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించుతూ సైన్యం ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ,ఉత్తర తీరాల్లో ఇరు దేశాలు ఇటీవలే తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. నిజానికి ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించినప్పటికీ.. అంతకన్నా ముందే ఇది పూర్తవడం విశేషం.


Source link

MORE Articles

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe