Sunday, September 19, 2021

అసోంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల… 11 మంది కొత్త ముఖాలకు చోటు…

National

oi-Srinivas Mittapalli

|

అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ శుక్రవారం(మార్చి 5) 70 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. తాజా జాబితాలో జాబితాలో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోవడం గమనార్హం. వారి స్థానంలో కొత్త వాళ్లకు బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇదే జాబితాలో ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌తో పాటు హోంమంత్రి హిమంత బిశ్వా శర్మ పోటీ చేస్తున్న స్థానాలను పార్టీ ప్రకటించింది. శర్భానంద సోనోవాల్ మజులి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి,హిమంత బిశ్వ శర్మ జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నట్లు వెల్లడించింది. ఈ ఇద్దరూ గతంలోనూ ఇవే నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

‘అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసోం గణ పరిషత్(ఏజీపీ),యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్)తో కలిసి బరిలో దిగుతుంది. మొత్తం 126 స్థానాలకు గాను ప్రస్తుతం 70 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాం. 26 సీట్లు ఏజీపీకి,8 సీట్లు యూపీపీఎల్ పార్టీకి సర్దుబాటు చేస్తున్నాం.’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.

assam bjp releases first list of 70 candidates 11 new faces there

అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో అసోంను వరదలు లేని రాష్ట్రంగా చేయాలన్న సవాల్ తమ ముందు ఉందన్నారు. ఇప్పటివరకూ కొనసాగించిన అభివృద్ది ఎజెండానే ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. అలాగే ఎన్‌ఆర్‌సీ వంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అసోం ప్రజలు మరోసారి బీజేపీకే అధికారం కట్టబెడుతారని ధీమా వ్యక్తం చేశారు.

అసోంలో మార్చి 27,ఏప్రిల్ 1,ఏప్రిల్ 6 తేదీల్లో మొత్తం మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు,రెండో దశలో 39,మూడో దశలో 40 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మిగతా రాష్ట్రాలతో పాటే మే 2వ తేదీన వెలువడనున్నాయి. గత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో బీజేపీ 60 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పదేళ్ల పాలనకు తెరపడింది. ఈసారి ఎన్నికల్లో అసోం ఓటరు తిరిగి బీజేపీకే పట్టం కడుతారా లేక కాంగ్రెస్‌ను గద్దెనెక్కిస్తారా అన్నది చూడాలి.


Source link

MORE Articles

Punjab CM: పొలిటికల్ థ్రిల్లర్: తెర మీదికి అనూహ్య పేరు: గాంధీ కుటుంబానికి రైట్‌హ్యాండ్

సమూల మార్పు.. దీనికి అనుగుణంగా ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని...

జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆరంభం : మధ్నాహ్నం తరువాత ఫలితాలు : వైసీపీ నేతల్లో ధీమా..!!

హైకోర్టు తీర్పుతో నేడు ఓట్ల లెక్కింపు హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయ్యాయి. మూడు రోజుల క్రితమే హైకోర్టు...

CSK vs MI: బిగ్ బ్యాంగ్: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే: సన్..రైజ్ అయ్యేనా?

ఎవరు టాప్.. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో ఢిల్లీ కేపిటల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన ఈ టీమ్ ఆరు విజయాలను సొంతం చేసుకుంది....

SpaceX’s Inspiration4 crew returns to Earth, capping first fully private mission in orbit

SpaceX’s Crew Dragon capsule carrying four private citizens plunged through Earth’s atmosphere Saturday night and splashed down off the east coast...

Microsoft Surface Duo 2 FCC filings reveal 5G, Wi-Fi 6, and NFC support

TL;DR The Microsoft Surface Duo 2 FCC documents have now been filed, and they reveal a bit more about the upcoming Android smartphone. The filings...

Watch SpaceX’s all-civilian spaceflight return to Earth starting at 6PM ET | Engadget

SpaceX's all-civilian Inspiration4 spaceflight is coming to an end, and the company wants to be sure you see those last moments. The firm...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe