Friday, July 30, 2021

అసోం : పరుగుల చిరుత హిమదాస్‌ డీఎస్పీగా నియామకం…

National

oi-Srinivas Mittapalli

|

భారత స్టార్ అథ్లెట్, పరుగుల చిరుత హిమదాస్‌కు(21) అసోం ప్రభుత్వం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదవిని కట్టబెట్టింది. శుక్రవారం(ఫిబ్రవరి 26) జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ హిమదాస్‌కు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర డీజీపీ భాస్కర్ జ్యోతి మహాత్మ స్వయంగా హిమదాస్‌ యూనిఫాంపై స్టార్లను తొడిగి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హిమదాస్ మాట్లాడుతూ… తన చిన్ననాటి కల ఈరోజు నెరవేరిందన్నారు.’ స్కూల్లో చదువుకునే రోజుల్లో నుండే పోలీస్ అధికారి కావాలన్న కోరిక ఉండేది. నా తల్లి కూడా అదే కోరుకుంది. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి క్రీడలే కారణం. కాబట్టి భవిష్యత్తులో అసోంను క్రీడా రంగంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తాను.’ అని హిమదాస్ తెలిపారు. అసోం పోలీస్ విభాగంలోనూ తాను శ్రద్దగా పనిచేస్తానని… అదే సమయంలో స్పోర్ట్స్ విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేసేది లేదని అన్నారు. తనకు ఈ గౌరవాన్ని,హోదాను ఇచ్చినందుకు ముఖ్యమంత్రి సోనోవాల్‌కు,అసోం ఒలింపిక్ కమిటీకి,డీజీపీ భాస్కర్ జ్యోతికి హిమదాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Athlete Hima Das appointed Deputy Superintendent of Police of Assam

డీఎస్పీగా హిమదాస్ నియామకం యువతలో స్పూర్తిని నింపుతుందని ముఖ్యమంత్రి సోనోవాల్ అన్నారు. అసోం రాష్ట్రానికి ఇదో గర్వించదగ్గ రోజు అని అభిప్రాయపడ్డారు.

అసోంలోని నగావ్ జిల్లాలోని దింగ్ అనే కుగ్రామంలో అత్యంత పేద కుటుంబంలో హిమదాస్ జన్మించిన సంగతి తెలిసిందే. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామం నుంచి హిమదాస్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కాళ్లకు కనీసం సరైన చెప్పులు కూడా లేని స్థితిలో… బురద నేలలో వట్టి పాదాలతోనే హిమ చిరుతలా పరిగెత్తేవారు. చదువు కోసం హిమ జవహర్ నవోదయ పాఠశాలలో చేరడం… అక్కడ పీఈటీ ఆమెను ప్రతిభను గుర్తించడంతో హిమదాస్ అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టారు. 2018లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో హిమా 400 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. ఈఘనత సాధించిన భారత తొలిమహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజతం సాధించారు.


Source link

MORE Articles

బిగాస్ నుండి రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు; ఈసారి మేడ్ ఇన్ ఇండియా..

ఈసారి బిగాస్ పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన 2020లో లాంచ్ చేసిన...

Multani Mitti Face Pack : बारिश के मौसम में इस तरह चेहरे पर लगाएं मुल्तानी मिट्टी, ग्लो रहेगा बरकरार, खत्म होंगी ये skin problem

Multani Mitti Face Pack : पूरे देश में मानसून सक्रिय है और झमाझम का बारिश का दौर जारी है. बरसात (Monsoon) आते ही...

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe