Friday, June 18, 2021

అస్వస్థతకు గురైన బీజేపీ ఎంపీ… విమానంలో ముంబై తరలింపు… కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరిక…

National

oi-Srinivas Mittapalli

|

బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటిన విమానంలో ముంబైకి తరలించారు. ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో ఎంపీని చేర్చినట్లు ఆమె కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఆమె అస్వస్థతకు గురవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఫిబ్రవరి 19న అస్వస్థతకు గురైన ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

అంతకుముందు,డిసెంబర్,2019లో ఆమె కరోనాతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ కొద్దిరోజుల చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రగ్యా అనారోగ్య కారణాలతో 2017లో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసిన ఆమె కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై 3.6లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి ఎంపీగా గెలవడం దేశంలో ఇదే తొలిసారి.

ప్రగ్యా సింగ్ ఠాకూర్ గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మహాత్మాగాంధీ చంపిన నాథురాం గాడ్సేని దేశభక్తుడు అంటూ కొనియాడారు. గతేడాది డిసెంబర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… క్షత్రియులను క్షత్రియులని పిలిస్తే బాధపడరని, బ్రాహ్మణులను బ్రాహ్మణులని అంటే వారు చింతించరని, వైశ్యులను వైశ్యులని పిలిస్తే బాధపడరని, కానీ శూద్రులను మాత్రం శూద్రులని అంటే తెగ బాధపడిపోతారని, ఎందుకంటే వారు అజ్ఞానులని ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ప్రగ్యా వ్యాఖ్యలపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… ఆమెకు పిచ్చెక్కిందని కౌంటర్ ఇచ్చారు.




Source link

MORE Articles

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe