[ad_1]
Auto Expo 2023: మార్కెట్‌ను పిచ్చెక్కించడానికి వస్తున్న ఎలక్ట్రిక్ కారు BYD SEAL. ఇది చాలా అందంగా ఉంది. ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని ప్రదర్శించారు. దీంతోపాటు చైనీస్ వాహన తయారీ సంస్థ BYD భారతదేశంలో తన పట్టును బలోపేతం చేయడానికి BYD ATTO 3 Limited Edition కారును కూడా విడుదల చేసింది. ఈ కారును ఫారెస్ట్ గ్రీన్ కలర్‌లో కూడా చూడవచ్చు.
బీవైడీ సీల్ వివరాలు
BYD SEAL 2023 చివరి నాటికి భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్లు నడుస్తుంది. ఇందులో టెక్నాలజీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
బీవైడీ సీల్‌ను ఈ-ప్లాట్‌ఫారమ్ 3.0పై రూపొందించారు. ఇది అల్ట్రా సేఫ్ బ్లేడ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది అత్యంత సురక్షితమని తెలిపారు. సేఫ్టీ, స్టెబిలిటీ, హ్యాండ్లింగ్, పెర్ఫామెన్స్ పరంగా అత్యుత్తమంగా నిరూపించుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ కారు సీబీటీ టెక్నాలజీపై పని చేయనుంది.
ఈ టెక్నాలజీ ద్వారా కారుకు ముందు, వెనుక యాక్సిల్స్‌పై చెరో 50 శాతం యాక్సిల్ లోడ్ పడనుంది. ఇది కారును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ టెక్నాలజీ కారుకు లాంగ్ రేంజ్ కూడా ఇస్తుంది. కారులో సేఫ్టీ ఇంటీరియర్ స్ట్రక్చర్‌ను అందించనున్నారు. దీన్ని భారతీయ రోడ్ల ప్రకారం రూపొందించారు.
BYD ఆటో కంపెనీ ఏ దేశానికి చెందినది?
BYD ఆటో చైనాలోని ప్రముఖమైన టాప్ కార్ కంపెనీలలో ఒకటి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల కారణంగా ఈ కంపెనీ భారతదేశంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2023లో భారత్‌లో తమ సర్వీస్ సెంటర్లను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. ఓవరాల్‌గా ఈ కారు ఎంత బాగుంటుందో, ఎంత మెరుగ్గా ఉంటుందో రాబోయే కాలమే చెప్పాలి. ఎందుకంటే ఇది ఇప్పటికే మార్కెట్‌లో కింగ్‌మేకర్‌లుగా ఉన్న భారతదేశంలోని మారుతీ, టాటా వంటి కంపెనీలతో పోటీ పడుతోంది.
[ad_2]
Source link