[ad_1]
ఆగని దగ్గుంటే..
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. చూడ్డానికి చిన్న సమస్యగా అనిపించినా కొన్ని విషయాలు ముందు జాగ్రత్తలు అవసరం. ఇదే విధంగా దగ్గు విషయంలో కూడా అంతే. అదేపనిగా ఆగకుండా దగ్గు వస్తుంటే శరీరం మనకి ఏదో సమస్య వస్తుందని ముందుగానే సిగ్నల్ ఇచ్చినట్లు. ఈ విషయం గురించి నిపుణులు జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు.
Also Read : Fenugreek Tea : ఈ టీ తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట..
అలెర్జీ..
ఆగకుండా వచ్చే దగ్గు అలెర్జీ వల్ల కూడా రావొచ్చు. దీనిని ఆలస్యం చేస్తే సమస్య ముదిరి శరీరంలోని ఇతర భాగాలపై ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. దుమ్ము, పురుగులు, పొప్పొడి వంటి కారణాలు అలెర్జీకి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ముక్కు పొరలను ఇబ్బంది పెట్టి అక్కడ్నుండి గొంతులోకి చేరి శ్లేష్మం కారేలా చేస్తాయి. దీంతో దగ్గు వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో.
ఆస్తమా..
ఉబ్బసం ఉన్నప్పుడు కూడా మీ శ్వాస నాళాల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండి.. లైనింగ్ ఉబ్బుతుంది. మీ శ్వాసనాళాల్లోని కణాలు మందపాటి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి దగ్గుకి కారణమవుతాయి.
క్యాన్సర్..
దగ్గు క్యాన్సర్‌కి కూడా సంకేతమే. అయితే, అన్ని సమయాల్లోనూ అదే కారణం కాకపోవచ్చు. అందుకే ముందునుంచే జాగ్రత్తలు ఉండాలి. వీటితో పాటు.. అంటువ్యాధులు, వాతావరణం, అలెర్జీలు, పొగాకు పొగ, మందులు వాడడం, వర్కౌట్ వల్ల కూడా దగ్గు వస్తుంది. జలుబు, ఫ్లూ, న్యుమోనియా వచ్చి తగ్గాక కూడా దగ్గు రావొచ్చు. స్మోకింగ్, బీపికి వాడే మందుల వల్ల దగ్గు వస్తుంది. గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు కూడా దగ్గు వస్తుంది.
Also Read : Brown Rice : బరువు తగ్గించే బ్రౌన్‌రైస్.. ఎలా వండాలంటే..
ప్రొఫెసర్స్ ప్రకారం..
కారణం లేకుండా వచ్చే అంటు వ్యాధుల గురించి మాట్లాడిన ప్రొఫెసర్ కమిలా హౌథ్రోన్(Professor kamila Hawthrone, chairwoman of the royal college of GPs) ఓ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే మరో ఇన్ఫెక్షన్ కావొచ్చు. ఇవన్నీ కూడా వేర్వేరుగా ఉంటాయి.
ఇమ్యూనిటీని పెంచుకోవడం వల్ల అంటువ్యాధులు, ఆ సమస్యల్లాంటి లక్షణాలను దూరం చేసేందుకు హెల్ప్ చేస్తుంది. దగ్గు కూడా ఇలాంటి కారణాల వల్లే వస్తుంది. వీటి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గణాంకాల ప్రకారం..
రాయల్ కాలేజ్ ఆఫ్ GPs రీసెర్చ్ అండ్ సర్వైలెన్స్ సెంటర్, యూకె గణాంకాల ప్రకారం.. చలికాలంలో, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ దగ్గు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఆగకుండా దగ్గు రావడమనేది కూడా మున్ముందు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలకి సూచన అని చెప్పొచ్చు. ఈ దగ్గు కూడా పొడి దగ్గు, కఫంతో కూడినదా అనేది గమనించాలని నిపుణులు చెబుతున్నారు.
ఎంతకాలం ఇన్ఫెక్షన్స్..
ఇన్ఫెక్షన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఎక్కువ రోజులు ఉంటే, మరికొన్ని మాత్రం త్వరగా తగ్గిపోతాయి. దీని గురించే పరీక్షించిన నిపుణులు.. ప్రజెంట్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రోజులు ఎందుకు ఉంటున్నాయో తెలియడం లేదని చెబుతున్నారు.
గత రెండేళ్ళలో మహమ్మారి ప్రభావంతో ఇన్ఫెక్షన్‌లని తట్టుకునే శక్తి కూడా తగ్గిందని, దీని వల్ల సమస్య పెరిగిందని చెబుతున్నారు నిపుణులు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే..
పరిశుభ్రంగా ఉండడం
చేతులను ఎప్పటికప్పుడు కడగడం
హ్యాండ్ వాష్ చేయడం కుదరకపోతే శానిటైజర్స్ వాడడం
దగ్గు, జలుబు, గొంతు నొప్పిని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండడం
హైడ్రేటెడ్‌గా ఉండడం
రెస్ట్ తీసుకోవడం
Also Read : Collagen : ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ముఖం మెరుస్తుందట..
అయినా తగ్గకపోతే..
సరైన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. అయినప్పటికీ, ముఖ్యంగా దగ్గు ఆగకుండా రావడం, కఫంతో కూడిన దగ్గు వస్తుంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి.
శ్వాస తీసుకోవడం కష్టంగా మారినా, ఛాతీ నొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలు ఉంటే కచ్చితంగా డాక్టర్‌ని కలిసి ఏ సమస్య ఉందో చెక్ చేసుకోవడం మంచిది. మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్ సమస్య ఎందుకొచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link