Wednesday, March 3, 2021

ఆసిఫాబాద్‌లో చిరుత కలకలం… జనావాసాల్లోకి దూరి పశువులపై దాడి… భయాందోళనలో ప్రజలు…

Telangana

oi-Srinivas Mittapalli

|

తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి 19) తెల్లవారుజామున 3గంటల సమయంలో పెంచికల్‌పేట్‌లోని ఓ ఇంటి ఆవరణలోకి పులి ప్రవేశించింది. అక్కడే కట్టేసి వున్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో అది గట్టిగా అరవడంతో ఇంటి యజమాని పోశయ్య ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు. తలుపులు తీసుకుని బయటకు వచ్చి చూడగా… ఇంటి ఆవరణలో పులి కనిపించింది. పులి తనవైపే దూసుకొస్తున్నట్లు కనిపించడంతో పోశయ్య గట్టిగా కేకలు వేశాడు. దీంతో పులి అటు నుంచి అటే అడవిలోకి పారిపోయింది.

తెలంగాణలోని కుమ్రంభీం,పెద్దపల్లి జిల్లాల్లో గత కొన్ని నెలలుగా చిరుతపులులు సంచరిస్తున్నాయి. దీంతో ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రజలు పొలం పనులకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. కుమ్రంభీం జిల్లాలో తప్పించుకు తిరుగుతున్న పులి ఇప్పటివరకూ 34 పశువులను బలితీసుకుంది. అటవీశాఖ అధికారులు దాన్ని బంధించేందుకు జనవరి 11 నుంచి జనవరి 18 వరకూ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆ పులి ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్ర వైపు వెళ్లడంతో ఆపరేషన్ ఆగింది.జనవరి 24 నుంచి మరో పులి సంచరిస్తున్నట్లు చెప్తున్నారు. పులి జనావాసాల్లోకి వస్తుండటంతో పెంచికల్‌పేట్,బెజ్జూర్,దహెగాం మండలాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

panic grips asifabad district after leopard attack cattle in penchikalpet

ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ కొన్ని నెలలుగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లు బయటపడుతున్నాయి. పులి సంచారంతో ముత్తారం,ఓడేడు,మచ్చుపేట,అడవి శ్రీరాంపూర్,రామగిరి,వెన్నంపల్లి,బేగంపేట,లక్కారం,కాల్వ శ్రీరాంపూర్ మండలాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

చత్తీస్​ఘడ్​ అడవుల నుంచి గతేడాది జూన్​లో ఒక పెద్దపులి భూపాలపల్లి జిల్లాలోప్రవేశించినట్లు ఫారెస్ట్​ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి చిట్యాల దగ్గర మానేరు నది దాటి పెద్దపల్లి జిల్లా ముత్తారం ఓడేడు గ్రామ శివారులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఇదే క్రమంలో మచ్చుపేటకు చెందిన పశువుల కాపరి కార్కురి రాజయ్య ఆవుల మందపై పులి దాడి చేసింది. అయితే ఇప్పటివరకూ మళ్లీ ఆ పులి జాడ చిక్కలేదు.


Source link

MORE Articles

విజయసాయి కౌంటర్: గంటా వచ్చినా.. రాకున్న నో ఫరక్! మైండ్‌గేమ్ అవసమే లేదు

గంటా ప్రతిపాదనలు పంపారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రతిపాదన పంపారని, దానిపై సీఎం వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని...

Microsoft and IBM use apprentice programs to diversify the tech world and solve the labor shortage

Apprenti works with tech companies in 15 states to expand the pipeline of software engineers,...

ఏనుగు ప్యాంటేస్తే Ele-Pant… -వైర‌ల్ పిక్‌ను షేర్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా

మిగతా పారిశ్రామికవేత్తలకు భిన్నంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, దేశసమకాలీన పరిస్థితులపై స్పందించడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు. తన దృష్టికి వచ్చిన సందేశాత్మక, ఫన్నీ ఫొటోలు, వీడియోలను ఎప్పుడూ సోషల్‌మీడియాలో పంచుకుంటారాయన....

నిర్మల భర్త పరకాల ప్రభాకర్ సంచలనం -ప్రధాని మోదీ భయానక తప్పిదం -ఎల్బీ స్డేడియం, ప్రకాశం జిల్లా?

మిడ్ వీక్ మ్యాటర్స్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీ పట్టాపొందిన పరకాల ప్రభాకర్.. డేటా సైన్స్, పొలిటికల్ అనాలసిస్, డిజిటల్ మార్కెటింగ్ లోనూ రాణించారు....

Google promises to stop selling your browsing history to advertisers

In brief: Google explicitly says that when it phases out tracking...

విజయసాయి రెడ్డే చెప్పాలి: పార్టీ మార్పు, సీఎంకు ప్రతిపాదనలపై తేల్చేసిన గంటా శ్రీనివాసరావు

ఇది వైసీపీ మైండ్ గేమ్.. 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు వందసార్లు తాను పార్టీలు మారుతానని పుకార్లు వచ్చాయని గంటా శ్రీనివాస్ చెప్పారు. విజయసాయి...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe