News
lekhaka-Bhusarapu Pavani
RBI
News:
ఇటీవలి
కాలంలో
రిజర్వు
బ్యాంక్
ఆఫ్
ఇండియా
నిబంధనలు
పాటించని
అనేక
బ్యాంకుల
లైసెన్సును
రద్దు
చేసింది.
ఈ
క్రమంలో
అనేక
సహకార
బ్యాంకులు
ప్రభావితం
అయ్యాయి.
ఈ
క్రమంలో
తాజాగా
కేరళకు
చెందిన
అదూర్
కో-ఆపరేటివ్
అర్బన్
బ్యాంక్
బ్యాంకింగ్
లైసెన్స్‌ను
రద్దు
చేస్తున్న
RBI
నోటిఫికేషన్
జారీ
చేసింది.
ఈ
రూల్స్
ఏప్రిల్
24,
2023న
వ్యాపారం
ముగిసినప్పటి
నుంచి
అమలులోకి
వచ్చింది.
అయితే
బ్యాంకింగేతర
సంస్థగా
పనిచేయడానికి
అనుమతించినట్లు
రిజర్వ్
బ్యాంక్
అనుమతించింది.

బ్యాంకింగ్
నియంత్రణ
చట్టంలోని
పలు
సెక్షన్ల
కింద
అదూర్
కో-ఆపరేటివ్
అర్బన్
బ్యాంక్
లిమిటెడ్‌కు
మంజూరు
చేసిన
జనవరి
3,
1987
నాటి
బ్యాంకింగ్
లైసెన్స్‌ను
రద్దు
చేసినట్లు
సెంట్రల్
బ్యాంక్
తెలిపింది.
RBI
ప్రకారం..
బ్యాంక్,
NBFC
మధ్య
వ్యత్యాసం
ఏమిటంటే,
బ్యాంక్
ప్రజలకు
బ్యాంకింగ్
సేవలను
అందించే
ప్రభుత్వ-అధీకృత
సంస్థ.
NBFC
అనేది
బ్యాంక్
లైసెన్స్
లేకుండా
ప్రజలకు
బ్యాంకింగ్
సేవలను
అందించే
సంస్థ.
నాన్
బ్యాంకింగ్
కంపెనీలు
ఎక్కువగా
ప్రజలకు
రుణ
సేవలను
అందిస్తుంటాయి.
ఇదే
క్రమంలో
వివిధ
నిబంధనలను
ఉల్లంఘించినందుకు..
బాంబే
మర్కంటైల్
కో-ఆపరేటివ్
బ్యాంక్‌కు
రూ.13
లక్షలు,
తమిళనాడు
స్టేట్
అపెక్స్
కో-ఆపరేటివ్
బ్యాంక్‌కు
రూ.16
లక్షలు,
పూణేకు
చెందిన
జనతా
సహకరి
బ్యాంక్‌కు
రూ.13
కోట్లు,
బరన్
నగ్రిక్
సహకారి
బ్యాంక్‌లపై
జరిమానాలు
విధించినట్లు
ఆర్‌బీఐ
సోమవారం
ప్రకటించింది.
‘డిపాజిట్‌లపై
వడ్డీ
రేటు’పై
ఆదేశాలను
పాటించనందుకు
పూణేలోని
జనతా
సహకరి
బ్యాంక్‌పై
అత్యధిక
జరిమానా
విధించినట్లు
సెంట్రల్
బ్యాంక్
ప్రత్యేక
నోటిఫికేషన్‌లో
పేర్కొంది.
దీనికి
ముందు
2022లో
వివిధ
నియంత్రణ
నిబంధనలను
ఉల్లంఘించినందుకు
180కి
పైగా
బ్యాంకులకు
రిజర్వు
బ్యాంక్
జరిమానా
విధించింది.
2020లో
ఆర్‌బీఐ
22
సహకార
బ్యాంకులకు
జరిమానా
విధించగా..
2021లో
124
బ్యాంకులకు
జరిమానా
విధించింది.
English summary
RBI canceled kerala’s Adoor Co-operative Urban Bank’s banking licence, imposed penalty on few
RBI canceled kerala’s Adoor Co-operative Urban Bank’s banking licence, imposed penalty on few
Story first published: Tuesday, April 25, 2023, 22:53 [IST]