ఆ రెండు దేశాలు నాకు చాలా ద‌గ్గ‌ర‌: ట‌్రంప్

Date:

Share post:


ఆ రెండు దేశాలు నాకు చాలా ద‌గ్గ‌ర‌: ట‌్రంప్న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పెహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పందించారు. ఆ దాడి ఓ చెత్త పనిగా అభివర్ణించారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల కోసం ట్రంప్‌ ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని చెప్పుకొచ్చారు. ‘నాకు భారత్, పాకిస్థాన్‌.. రెండు దేశాలూ చాలా దగ్గర. కశ్మీర్‌ ప్రాంతంలో 1,500 ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ రెండు దేశాల గురించి నాకు బాగా తెలుసు. ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కరించుకుంటాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను’ అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు ఉగ్రదాడి ఘటనపై స్పందించిన ట్రంప్‌.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, భారత ప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్...

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...