Thursday, June 17, 2021

ఆ వ్యవస్థ కోసం రూ. 310 కోట్లు వృథా.. సోము వీర్రాజు, తిరుపతిలో గెలుపునకు మూడంచెల ప్లాన్

Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

తిరుపతి: ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో నవరత్నాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 310 కోట్ల ప్రజాధనం వృథా చేస్తోందని ఆక్షేపించారు.

తిరుపతి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ.. ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందని అన్నారు. పోలీస్, పంచాయతీరాజ్, వాలంటీర్ వ్యవస్థల అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు తెలిపారు.

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రచారం, పర్యవేక్షణ కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేసినట్లు సోము వీర్రాజు తెలిపారు. ప్రచార, నియోజకవర్గాల బాధ్యుల కమిటీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నేతృత్వం వహిస్తారని చెప్పారు.

కాగా, ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరుగనుండగా.. తిరుపతి టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ కూడా తమ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థికే జనసేన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రచారం చేయనున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. గెలుపు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.


Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe