[ad_1]
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో 16 గంటల పాటు లేదా వారంలో 24 గంటలు ఏమీ తినకుండా ఉండటం. అంటే రాత్రి 9 నుంచి పగలు ఒంటిగంట వరకూ లేదా వారికి వీలైన 16 గంటల సమయంలో ఏమీ తినకూడదు. మీ వీలును బట్టి ఈ 16 గంటలు మీరే నిర్ణయించుకోవాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో.. ఏం తినాలనే రూల్స్ లేవు. ఎప్పుడు తినాలనేదే ముఖ్యం. తీసుకునేది పౌష్టికాహారం అయితే మంచిదని నిపుణులు అంటున్నారు. ఫాస్టింగ్ సమయంలో నీళ్లు, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. అయితే కొందమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. చేసేప్పుడు డ్రింక్స్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో.. హై క్యాలరీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేప్పుడు తీసుకోకూడని డ్రింక్స్ ఏమిటో చూద్దాం.
టీ/ కాఫీ/ పాలు..
చాలా మంది.. ఫాస్టింగ్ పీరియడ్‌లో టీ/ కాఫీ/ పాలు తీసుకుంటూ ఉంటారు. పాలు, చక్కెర వంటి పదార్థాలు.. మీ జీవక్రియను, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఇవి ఉపవాసం చేస్తున్నప్పుడు తీసుకుంటే మంచిది కాదు. మీరు ఫాస్టింగ్ విరమించి.. ఆహారం తీసుకునేప్పుడు ఇవి తాగొచ్చు.
కొబ్బరి నీరు..
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకు తెలుసు. ఇవి మనల్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అయినప్పటికీ.. ఉపవాస సమయంలో ఇవి తాగొద్దు. ఉపవాసం ముగిసిన తర్వాత తీసుకుంటే మేలు.
వెజిటెబుల్ జ్యూస్/ ఫ్రూట్ జ్యూస్..
కొన్ని వెజిటెబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్‌లో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. సగటున 8-10 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఉపవాస సమయంలో మీరు కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. మీరు వీటిని ఉపవాసం ముగించిన తర్వాత తీసుకుంటే.. మంచిది.
సోడా, ఎనర్జీ డ్రింక్స్
ఉపవాసం చేస్తున్నప్పుడు.. సోడా, ఎనర్జీ డ్రింక్స్ తాగితే.. ఎనర్జీ వస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ వీటలో క్యాలరీలు, ఆర్టిఫిషియల్ స్వీట్నెర్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో 8-10 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇవి ఫాస్టింగ్‌కు బ్రేక్ చేస్తాయి.
ప్రోటీన్ పౌడర్..
ప్రోటీన్ పౌడర్‌లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది ఇన్సులిన్ స్థాయిల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మీ ఫాస్టింగ్‌ను బ్రేక్ చేస్తుంది.
ఇవి తాగండి..
నీళ్లు..
మీరు ఫాస్టింగ్ సమయంలో నార్మల్ వాటర్ తాగొచ్చు. వీటిలో కేలరీలు ఉండవు. మిమ్మల్ని హైడ్రేట్‌గానూ ఉంచుతాయి
నిమ్మ, అల్లం వేసిన గోరువెచ్చని నీళ్లు..
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించే వారికి ఇది ఉత్తమమైన పానీయం. దీనిలో క్యాలరీలు ఉండవ. ఇన్సులిన్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మీ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్..
గోరువెచ్చని నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని తాగినా మంచిదే.. ఇది మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది. మీ ఫాస్టింగ్ సమయంలో.. ఆకలి కోరికలను తగ్గిస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply