ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

Date:

Share post:


ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తాజాగా మరో స్టార్ నటుడు ముకుల్ దేవ్ (54) మరణించాడు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్‌ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ.. తుది శ్వాస విడిచాడు. ఇక ముకుల్ తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Writing is 'a little box of interest' for actor Mukul Dev

1996లో ముమ్కిన్ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. తర్వాత సన్నాఫ్ సర్దార్, ఆర్ రాజ్ కుమార్, జై హో లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. బాలీవుడ్ సినిమాల తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టితెలుగులో ర‌వితేజ .. కృష్ణ, ప్ర‌భాస్‌.. ఏక్ నిరంజన్, నాగార్జున‌.. కేడి, ఎన్‌టీఆర్‌.. అదుర్స్ లాంటి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. కాగా టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. తమిళ్, బెంగాలీ, మలయాళ, కన్నడ భాషలలో పలు సినిమాల్లో నటించాడు.

R Rajkumar And Jai Ho Actor Mukul Dev Dies At 54. Deepshikha Nagpal Pays Tribute

ఈయన.. ప్ర‌ముఖ‌ నటుడు రాహుల్ దేవ్ కు తమ్ముడు అవుతాడు. ఇక నిన్న మొన్న‌టివ‌ర‌కు తల్లిదండ్రుల క‌లిసి జీవించిన ముకుల్‌.. త‌ల్లిదండ్రుల మరణంతో.. గత కొంతకాలంగా ఒంటరిగానే లైఫ్ లీడ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో సతమతమవుతూ భాస్పిట‌ల్‌లో చేరిన ముకుల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడవడం అందరిని కలచి వేస్తుంది. అయితే ఇంకా ఆయన ఆనారోగ్యానికి కార‌ణాలు తెలిసిరాలేదు. కాగా ముకుల్ మరణ వార్త తెలియ‌డంతో ఎంతో మంది సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...

హీరో కాక‌పోతే క‌చ్చితంగా అదే చేసేవాడ్ని: మంచు విష్ణు

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. 1985లో విడుదలైన `రగిలే గుండెలు` సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా...