వీర్యాన్ని భద్రపరచి..
అహ్మదాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ డాక్టర్ తన వీర్యాన్ని తాను పురుషుడిగా ఉండగానే భద్రపరిచింది. తర్వాత అదే వీర్యంతో తానే తల్లి కూడా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. డాక్టర్ జెస్నూర్ డయారా గోద్రాలో గల పంచమహల్‌లో జన్మించింది. పుట్టినప్పుడు పురుషుడిలా అంగాలతో పుట్టింది. ఓ పురుషుడికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌తో ఉంది.

స్త్రీ లక్షణాలు కనిపించడంతో..
వయసు వచ్చే కొద్దీ తనలో స్త్రీ లక్షణాలు పెరుగుతుండడం గుర్తించింది. తానో ట్రాన్స్‌జెండర్ అని తెలిసొచ్చింది. దీంతో స్త్రీగా మారిపోవాలని నిర్ణయించుకుంది. కానీ స్త్రీగా మారిన తరువాత తాను తల్లిని కావాలని అనుకుంది. అదికూడా వేరే వ్యక్తి బిడ్డకు కాకుండా తన బిడ్డకే తాను తల్లిని అవ్వాలనుకుంది. ఆ బిడ్డకు తండ్రి..తల్లీకూడా తానే కావాలని అనుకుంది.

అత్యంత అరుదు..
ఇటీవల రష్యన్ వర్శిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీని సంపాదించిన డాక్టర్ కాబట్టి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంది. తన వీర్యాన్ని భద్రపరిచాడు. ఆనంద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లో తన వీర్యాన్ని క్రయోజనిక్ పద్ధతిలో భద్రపరిచాడు. స్త్రీగా మారిన తరువాత ఈ వీర్యాన్ని వినియోగించి బిడ్డను కనాలని భావిస్తోంది. త్వరలో సర్జరీతో ఆమె పూర్తిగా స్త్రీగా మారిపోబోతోంది. శస్త్ర చికిత్స పూర్తయిన తరువాత, ఈ వీర్యంతో ఆమె తల్లి కానుంది.

డయారా రికార్డు
అదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన ఏకైక వ్యక్తిగా డయారా రికార్డు సృష్టించనుంది. డాక్టర్ డయారా ఇటీవలే రష్యాకు చెందిన మెడికల్ వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా గుజరాత్లో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించారు.