[ad_1]
Landmark Cars, Abans Holdings IPO Listing: సూల వైన్‌యార్డ్స్ లిస్టింగ్ తర్వాతి రోజే, ఇవాళ (శుక్రవారం, 23 డిసెంబర్ 2022) మరో మూడు కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ల్యాండ్‌మార్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్ షేర్లు దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేశాయి. మార్కెట్ బ్యాడ్ మూడ్ ప్రభావం ఈ రెండు కంపెనీల లిస్టింగ్ మీద పడింది. లిస్టింగ్ గెయిన్స్ కోసం పెట్టుబడి పెట్టిన వాళ్లకు నిరాశ మిగిలింది.
ల్యాండ్‌మార్క్ కార్స్ IPO లిస్టింగ్
ల్యాండ్‌మార్క్ కార్స్ (Landmark Cars IPO) స్టాక్, 7 శాతం డిస్కౌంట్‌తో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో (NSE) లిస్ట్ అయింది. దాని IPO ఇష్యూ ప్రైస్ రూ. 506తో పోలిస్తే ఒక్కో షేరు రూ. 471 వద్ద ప్రారంభమైంది. లిస్టింగ్ తర్వాత కూడా ఈ స్టాక్ పతనం కొనసాగింది. 10 శాతం తగ్గి రూ. 446 వద్దకు చేరుకుంది. ఈ రిపోర్ట్ సమయానికి, షేరు ధర 9.49 శాతం క్షీణించి రూ. 458 వద్ద ట్రేడ్ అవుతోంది.
ల్యాండ్‌మార్క్ కార్స్ IPO 2022 డిసెంబర్ 13 నుండి 15 తేదీల మధ్య కొనసాగింది. అయితే, పెట్టుబడిదార్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 8.71 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 0.59 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్ అయింది. ఖరీదైన వాల్యుయేషన్ కారణంగా పెట్టుబడిదారులు ఈ IPO కి దూరంగా ఉన్నారు. రూ. 481- 506 ప్రైస్ రేంజ్‌లో షేర్లను అమ్మిన కంపెనీ, మొత్తం రూ. 552 కోట్లను సమీకరించింది.
అబాన్స్ హోల్డింగ్స్ IPO లిస్టింగ్
అబాన్స్ హోల్డింగ్స్ IPO (Abans Holdings IPO) కూడా పెట్టుబడిదారులను తీవ్రంగా నిరాశ పరిచింది. IPO ఇష్యూ ధర రూ. 270 తో పోలిస్తే, నామమాత్రంగా 1.11 శాతం ప్రీమియంతో రూ. 273 వద్ద స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఈ స్టాక్ లిస్ట్ అయింది. అయితే, ప్రతికూల మార్కెట్ పవనాల మధ్య భారీగా పతనమైంది. BSEలో 23.49 శాతం క్షీణించి, రూ. 218.65 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని క్రియేట్ చేసింది. NSEలో 23.63 శాతం పతనంతో రూ. 218.40 స్థాయికి పడిపోయింది.
News Reels
2022 డిసెంబరు 12- 15 తేదీల మధ్య ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లేయర్ IPO కొనసాగింది. రూ. 256- 270 రేంజ్‌లో ఒక్కో షేరును పబ్లిక్ ఇష్యూలో విక్రయించి రూ. 345.6 కోట్లను మూటగట్టుకుంది. ఈ ఇష్యూకు కూడా అంతంత మాత్రంగా స్పందన వచ్చింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ (QIBs) 4.10 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.48 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా కేవలం 40 శాతం బుక్ అయింది.
లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసుకున్నవాళ్లను ఈ రెండు IPOలు ముంచేస్తాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ముందు నుంచీ ఊహిస్తున్నారు, ఇవాళ అదే జరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply