Stocks to watch today, 29 December 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 91 పాయింట్లు లేదా 0.50 శాతం రెడ్‌ కలర్‌లో 18,046 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టితో, వీక్లీ కాంట్రాక్ట్‌తో పాటు డిసెంబర్‌ మంత్లీ కాంట్రాక్ట్‌ ముగుస్తుంది. సంవత్సరాంతం కాబట్టి ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్‌ తగ్గింది. దీంతో ఇవాళ ట్రేడింగ్‌ ఉత్సాహంగా సాగదన్న అంచనాలు ఉన్నాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

కేఫిన్‌ టెక్నాలజీస్: ఈ కంపెనీ షేర్లు ఇవాళ (గురువారం, 29 డిసెంబర్ 2022‌) స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ కాబోతున్నాయి. గ్రే మార్కెట్ ట్రెండ్స్‌ ప్రకారం, ఒక్కో షేరు దాని ఇష్యూ ధర కంటే రూ. 5 తగ్గింపుతో ట్రేడ్‌ అవుతోంది. కాబట్టి, లోయర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 347కు సమీపంలో లేదా అంతకంటే తక్కువలో స్టాక్‌ ఓపెన్‌ కావచ్చు. ఈ IPOలో రూ. 347-366 ప్రైస్‌ రేంజ్‌లో షేర్లను ఇష్యూ చేశారు.

News Reels

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ రుణదాత, 2023 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ రూపాయల (1.21 బిలియన్ డాలర్లు) విలువైన మౌలిక సదుపాయాల బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు సన్నాహాలు చేసుకుంటోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా: PSB అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మరో రూ. 1.13 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో PSB అలయన్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొత్తం వాటా 7.14% నుంచి 8.33%కి చేరుకుంది. కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి ఆర్థిక & ఆర్థికేతర బ్యాంకింగ్ సేవలను అందించడానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ PSB అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌.

టాటా పవర్: టాటా పవర్‌ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, కర్ణాటకలో 255 మెగావాట్ల హైబ్రిడ్ విండ్ & సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం టాటా పవర్ దిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్టు పొందింది.

షీలా ఫోమ్: మ్యాట్రెస్ బ్రాండ్ స్లీప్‌వెల్‌ను తయారు చేస్తున్న ఈ కంపెనీ, కర్లోన్‌ (Kurlon) వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి ఆ కంపెనీతో తుది చర్చలు జరుపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇది పూర్తయితే, కర్లోన్‌కు బలమైన ఉనికి ఉన్న భారతదేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు, ఇతర మార్కెట్లలో వ్యాపారాన్ని విస్తరించడానికి షీలా ఫోమ్‌కు ఈ ఒప్పందం కలిసి వస్తుంది.

గుజరాత్ గ్యాస్: ఈ కంపెనీ క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ మెరుగుపడుతుందన్న అంచనాలతో, గుజరాత్‌ గ్యాస్‌ దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్‌ను ‘AA+’ నుంచి ‘AAA’కి క్రిసిల్‌ (CRISIL) రేటింగ్స్ అప్‌గ్రేడ్ చేసింది.

టాటా స్టీల్: టాటా స్టీల్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్‌లో ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 14.8 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా, ఈ కంపెనీలో వాటాను టాటా స్టీల్ దక్కించుకుంటుంది.

JSW ఎనర్జీ: 700 మెగావాట్ల సామర్థ్యమున్న ఇండ్-బరత్ ఎనర్జీ (ఉత్కల్) కంపెనీ JSW ఎనర్జీ చేతికి వచ్చింది. దివాలా ప్రక్రియ ద్వారా రూ. 1,047.60 కోట్లకు కొనుగోలును JSW ఎనర్జీ పూర్తి చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *