[ad_1]
Stocks to watch today, 02 January 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 40 పాయింట్లు లేదా 0.22 శాతం రెడ్ కలర్‌లో 18,183 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
కోల్ ఇండియా: 2022 డిసెంబర్‌లో కోల్ ఇండియా వెలికి తీసిన మొత్తం బొగ్గు గత ఏడాది ఇదే కాలం కంటే 10.3% పెరిగి 66.4 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఆఫ్‌టేక్ 3.6% పెరిగి 62.7 మిలియన్ టన్నులకు చేరుకుంది.
MOIL: బహుళ సంవత్సరాల రికార్డును బద్దలుకొడుతూ, ఈ కంపెనీ [Manganese Ore (India) Limited] 2022 డిసెంబర్‌లో 1,41,321 టన్నుల అత్యుత్తమ ఉత్పత్తిని నమోదు చేసింది, నవంబర్ కంటే 18% పెరిగింది. ఈ నెలలో 1,64,235 టన్నుల అమ్మకాలు సాధ్యమయ్యాయి, నవంబర్ కంటే దాదాపు 91% పెరిగాయి. దీంతోపాటు, కంపెనీ అన్ని గ్రేడ్స్‌లో ధరలను 2.7-15% పరిధిలో ఆదివారం నుంచి పెంచింది.
News Reels
మారుతి సుజుకీ ఇండియా: 2022 డిసెంబర్‌లో కంపెనీ మొత్తం వాహన విక్రయాలు గత ఏడాది ఇదే కాలం కంటే 9% క్షీణించి 1,39,347 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ విక్రయాలు 10%పైగా తగ్గి 1,17,551 యూనిట్లకు చేరుకున్నాయి. వాహనాల ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కొంత ప్రభావం చూపింది, ప్రధానంగా దేశీయ మోడళ్ల మీద ఎక్కువ ప్రభావం పడింది.
ఐషర్ మోటార్స్: 2022 డిసెంబర్‌లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7% క్షీణించి 68,400 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 17.3% పెరిగి 7,221 యూనిట్లకు చేరుకున్నాయి.
టాటా మోటార్స్: 2022 డిసెంబర్‌లో మొత్తం దేశీయ విక్రయాలు ఏడాదికి 10% పెరిగి 72,997 యూనిట్లకు చేరుకున్నాయి. టోకు అమ్మకాల కంటే రిటైల్ అమ్మకాలు 13% పెరిగాయి, Q3లో 6.3% వృద్ధి చెందాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు డిసెంబర్‌లో 14% పెరిగి 40,407 యూనిట్లకు చేరుకున్నాయి.
ఎస్కార్ట్స్ కుబోటా: డిసెంబర్‌లో మొత్తం ట్రాక్టర్ అమ్మకాలు ఏడాదికి 19% పెరిగి 5,573 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ అమ్మకాలు 22% పెరగ్గా, ఎగుమతులు 3.4% తగ్గాయి.
VST టిల్లర్స్: 2022 డిసెంబర్‌లో మొత్తం టిల్లర్స్ & ట్రాక్టర్ అమ్మకాలు గత సంవత్సరం ఇందే కాలం కంటే 25.2% పెరిగి 4,559 యూనిట్లకు చేరుకున్నాయి.
అక్ష్ ఆప్టిఫైబర్: వన్-టైమ్ సెటిల్‌మెంట్ డీల్ ద్వారా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి ఈ కంపెనీ బకాయిలు చెల్లించింది. సెటిల్‌మెంట్ కింద కంపెనీ రూ.5.5 కోట్లను రుణదాతకు చెల్లించింది.
న్యూఢిల్లీ టెలివిజన్ (NDTV): ఈ న్యూస్ బ్రాడ్‌కాస్టర్‌లో 27.26% వాటాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు ఒక్కో షేరును రూ. 342.65 చొప్పున విక్రయించినందుకు, NDTV వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ & రాధికా రాయ్ రూ. 602 కోట్లకు పైగా అందుకుంటారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్ ప్రైస్ రూ. 294 కంటే ఇది 17% అధికం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link