[ad_1]
Stocks to watch today, 17 January 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 4.5 పాయింట్లు లేదా 0.03 శాతం రెడ్ కలర్లో 17,940 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
సైమెన్స్: సరుకు రవాణా రైళ్లను సరఫరా చేయడానికి & సేవలు అందించడానికి ఇండియన్ రైల్వేస్ నుంచి ఈ కంపెనీ రూ. 26,000 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం కంపెనీ 1,200 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను డెలివరీ చేస్తుంది, 35 సంవత్సరాల పాటు సేవలను అందిస్తుంది.
మహీంద్రా & మహీంద్రా: తన ఎలక్ట్రిక్ SUV XUV400 మోడల్లో 20,000 యూనిట్లను డెలివరీ చేయాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 15.99 లక్షలు. గత ఏడాది సెప్టెంబర్‌లో XUV400ని ఆవిష్కరించిన మహీంద్రా & మహీంద్రా, తొలి దశలో భాగంగా 34 నగరాల్లో రెండు వేరియంట్లలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
టాటా మోటార్స్: 2022లో 5 లక్షల హోల్‌సేల్ విక్రయాల మార్కును దాటిన ఈ కంపెనీ, కొత్త లాంచ్‌లతో పాటు దాని సంప్రదాయ ఇంజిన్ మోడల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, CNG మోడల్స్‌లో మెరుగైన డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం బలమైన ఆదాయాన్ని ఆశిస్తోంది.
ఏంజెల్ వన్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ బ్రోకరేజ్ కంపెనీ ఏకీకృత ఆదాయం గత సంవత్సరం ఇదే త్రైమాసికం కంటే 20% పైగా పెరిగి రూ. 718 కోట్లకు చేరుకుంది. నికర లాభం సంవత్సరానికి 38.6% పెరిగి రూ. 228 కోట్లకు చేరుకుంది.
ఫీనిక్స్ మిల్స్: ఈ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఫీనిక్స్ లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, రూ. 26.03 కోట్లతో జానస్ లాజిస్టిక్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలును పూర్తి చేసింది.
NTPC: ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన NTPC రెన్యూవబుల్ ఎనర్జీ, త్రిపురలో ఫ్లోటింగ్ & గ్రౌండ్ మౌంటెడ్ ఆధారిత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి త్రిపుర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ బ్యాంక్ నికర లాభం రెండు రెట్లు పైగా పెరిగి రూ. 775 కోట్లకు చేరుకుంది. కేటాయింపుల్లో తగ్గుదల, నికర వడ్డీ ఆదాయంలో బలమైన వృద్ధి వల్ల ఇది సాధ్యపడింది. కేటాయింపులు గత ఏడాది కంటే 30.4% తగ్గి రూ. 580 కోట్లకు చేరుకున్నాయి.
మారుతి సుజుకి ఇండియా: 2022 క్యాలెండర్ సంవత్సరంలో, భారతీయ రైల్వేస్ ద్వారా ఈ కంపెనీ 3.2 లక్షలకు పైగా వాహనాలను రవాణా చేసింది. రైల్ మోడ్ ద్వారా ఒక క్యాలెండర్ సంవత్సరంలో రవాణా చేసిన రికార్డ్ నంబర్ ఇది.
ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం, ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల ఆదాయాలను పరిశీలించడానికి & ఆమోదించడానికి ఈ కంపెనీ బోర్డు సమావేశం కానుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link