[ad_1]
Stock Market Today, 24 August 2023: NSE నిఫ్టీ నిన్న (బుధవారం) 19,444 వద్ద క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (బుధవారం) ఉదయం 8.15 గంటల సమయానికి 13 పాయింట్లు లేదా 0.07 శాతం గ్రీన్ కలర్‌లో 19,518 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
కోఫోర్జ్: ప్రమోటర్ కంపెనీ బేరింగ్ పీఈ (Baring PE), దాని అనుబంధ సంస్థ హల్ట్స్ బీవీ ద్వారా, ఐటీ సేవల కంపెనీ కోఫోర్జ్‌లో (Coforge) తన మొత్తం వాటాను ఇవాళ బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించే అవకాశం ఉందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ బట్టి తెలుస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA), రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో (RRVL) రూ. 8,278 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ద్వారా ఈ భారీ మొత్తం పెట్టుబడిని QIA తీసుకువస్తుందని రిలయన్స్ రిటైల్ పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) బుధవారం ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ విలువను రూ. 8.278 లక్షల కోట్లుగా లెక్కగట్టి QIA పెట్టుబడి పెట్టింది. ఆ విలువ ప్రకారం, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ పెట్టుబడి RRVLలో 0.99 శాతానికి సమానం అవుతుంది.
టాటా కమ్యూనికేషన్స్: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) జారీ ద్వారా 1,750 కోట్ల రూపాయలు సమీకరించాలని ఆలోచిస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ (Tata Communications) తెలిపింది.
రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్: నేటి నుంచి కంపెనీ CFOగా అశోక్ కుమార్ నియామకానికి రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ (RattanIndia Enterprises) డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
JB ఫార్మా: డాక్సెపిన్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను USలో మార్కెట్ చేయడానికి JB ఫార్మా పెట్టుకున్న అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్‌కు (ANDA) అమెరికా ఔషధ నియంత్రణ అథారిటీ అయిన USFDA నుంచి అప్రూవల్ లభించింది.
బ్రైట్‌కామ్: సెబీ విధించిన నిషేధం తర్వాత, తాము ఎలా రియాక్ట్ కావాలన్న విషయాలపై ఆలోచిస్తున్నట్లు బ్రైట్‌కామ్ గ్రూప్ వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్ గ్రూప్ కంపెనీలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో, CMD సురేశ్ కుమార్ రెడ్డి, CFO నారాయణ్ రాజుపై సెబీ రెండు రోజుల క్రితం కొరడా ఝుళిపించింది. బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ (BGL)లో లేదా దాని అనుబంధ సంస్థల్లో ఏ విధమైన యాజమాన్య హోదా/ డైరెక్టర్ పదవుల్లో కొనసాగకుండా నిషేధం విధిస్తూ రెండో మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
టాటా మోటార్స్: తన అథరైజ్డ్ డీలర్లతో జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై టాటా మోటార్స్‌పై నమోదైన కేసు విచారణను CCI క్లోజ్ చేసింది.
TVS మోటార్: ఈ టూవీలర్ కంపెనీ, ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్లాట్‌ఫామ్ ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రెండు లక్షల స్కూటర్లను పంపిణీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, TCS, ఇన్ఫోసిస్: ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కంపెనీలపై గోల్డ్‌మన్ శాచ్స్ కవరేజీని ప్రారంభించింది. LTIMindtree, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ స్టాక్స్‌కు ‘బయ్’ రేటింగ్ ఇచ్చింది. టెక్ మహీంద్ర, విప్రోకు ‘సెల్’ రేట్ చేసింది, HCL టెక్నాలజీస్‌పై ‘న్యూట్రల్’గా ఉంది.
ఇది కూడా చదవండి: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ రూల్స్ మారాయి, మీరు కచ్చితంగా తెలుసుకోవాలి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link