PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈఎంఐ టెన్షన్‌కు గుడ్‌బై! ఈ చిన్న ట్రిక్‌తో వడ్డీలేకుండా ఇంటిని కొనుక్కోవచ్చు!


Interest Free Home Loan:

సొంత ఇల్లు.. చాలా మంది కల! గృహ రుణం తీసుకొని కల నెరవేర్చుకోవచ్చు గానీ పెరుగుతున్న వడ్డీరేట్లు చూస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నెలసరి వాయిదాల భారం నుంచి ఎలా బయటపడాలి దేవుడా అని నిట్టూరుస్తుంటారు. అలాంటి వారి కోసమే ఆర్థిక నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. అదే మ్యూచువల్‌ ఫండ్‌లో సిప్‌ పద్ధతిలో మదుపు చేసి వడ్డీ రహిత గృహ రుణం ప్రయోజనాలు పొందడం!

పెరుగుతున్న ఈఎంఐ భారం

కరోనా వచ్చాక ఆర్బీఐ వడ్డీభారం తగ్గించింది. దాదాపుగా 200 బేసిస్‌ పాయింట్ల మేర విధాన రేటును తగ్గించింది. ఫలితంగా గృహరుణాలు తక్కువకే దొరికాయి. అనేక మంది ఈ ప్రయోజనాన్ని పొందడం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం వల్ల కేంద్ర బ్యాంకులు రెపో రేట్ల పెంపు కొనసాగిస్తున్నాయి. ఆర్బీఐ సైతం ఇదే దారి అనుసరించడంతో ఆరు నెలల్లో 2.5 శాతం మేర వడ్డీ పెరిగింది.  ఇంకా పెంచితే ఈ భారాన్ని తాము ఇక భరించలేమంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి రుణంలో కేవలం ఒక శాతం ప్రతి నెలా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా వడ్డీ నుంచి తప్పించుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

News Reels

వన్‌ పర్సెంట్‌తో బెనిఫిట్‌!

ఉదాహరణకు శంకర్‌ అనే ఉద్యోగి 25 ఏళ్ల వ్యవధితో రూ.50 లక్షల ఇంటి రుణం తీసుకున్నాడని అనుకుందాం. 8 శాతం వడ్డీ లెక్కిస్తే 25 ఏళ్లకు మొత్తం కట్టాల్సిన డబ్బు రూ.1.15 కోట్లు. ఇందులో అసలు రూ.50 లక్షలు, వడ్డీ రూ.65 లక్షలు, కట్టాల్సిన ఈఎంఐ నెలకు రూ.38,591గా ఉంటుంది. ఇప్పుడు మీ గృహరుణంలో ఒక శాతం మొత్తం అంటే సంవత్సరానికి రూ.50వేలు మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేయాలి. నెలకు రూ.4200 చొప్పున 25 ఏళ్లకు మదుపు చేస్తే మొత్తం రూ.12.6 లక్షలు అవుతుంది.

లాభం రూ.74 లక్షలు!

సుదీర్ఘ కాలం మదుపు చేస్తారు కాబట్టి మ్యూచువల్‌ ఫండ్‌ రాబడి ఎనిమిది శాతంగా లెక్కిస్తే చివరికి మీకు అందే మొత్తం రూ.39-40 లక్షలు అవుతుంది. 9 శాతమైతే రూ.46-47 లక్షలు, 10 శాతమైతే రూ.54-55 లక్షలు, 11 శాతమైతే రూ.64-65 లక్షలు, 12 శాతమైతే రూ.75-76 లక్షలు అందుతాయి. ఈ లెక్కన మీకు కనీసం రూ.39 లక్షలు గరిష్ఠంగా రూ.76 లక్షలు అందుతాయి. నిజానికి మీ గృహ రుణంలో అసలు మినహాయిస్తే  చెల్లించే వడ్డీ రూ.65 లక్షలు. మ్యూచువల్‌ ఫండ్‌లో గరిష్ఠ లాభం అంతకన్నా ఎక్కువే. ఒకవేళ కనీస మొత్తమే అందినా మీ వడ్డీభారం 70 శాతం వరకు తగ్గుతుంది. అందుకే దీనిని సిప్‌ ఆధారిత వడ్డీరహిత రుణం లేదా వడ్డీ రహిత గృహరుణం కోసం మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌ ట్రిక్‌గా పిలుస్తుంటారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *