ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది
ఈ సంవత్సరం మీన రాశివారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. మొదటి 6 నెలలు గురువు, శని, కేతువు, రాహువు గోచారం అనుకూలంగా లేదు. దీనివల్ల సమయం సామాన్యంగా గడుస్తుంది. ఆదాయం కంటే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. లేదంటే వృథాఖర్చులు ఎక్కువ చేస్తారు. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మొహమాటానికి, గొప్పలకు పోయి డబ్బు ఖర్చుచేయడంవల్ల నగదుకు ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పు చేయడంకానీ, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడంకానీ చేసే అవకాశం ఉంటుంది.

డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండాలి.
ఈ సంవత్సరం మొత్తం డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండకుంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. గురువు గోచారం ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉండటంతో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలోనే మంచి లాభాలనిస్తాయి. దీనివల్ల తీసుకున్న అప్పులను తిరిగి తీర్చేయగలుగుతారు. మీ వృత్తి, వ్యాపారాల్లో కూడా అభివృద్ధి సాధించడంతో ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. అయితే రాహువు, కేతువు, శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సంవత్సరమంతా ఆర్థికంగా హెచ్చుతగ్గులుంటాయి.

లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అవసరం
కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మొదటి 6 నెలలు ఆర్థిక సంబంధ పెట్టుబడులు అనుకూలించవు. ఈ సమయంలో పెట్టుబడి కోసం మీ దగ్గరకు వచ్చే అవకాశాలన్నీ మీకు నష్టం చేకూర్చేవే. మంచివి కావు. గురు గోచారం ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది.. అనుకున్న ఫలితాలనిస్తుంది. అయినంత మాత్రాన సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల, మరియు నిపుణుల సలహా తీసుకొని మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది. రాహు, కేతువు గోచారం సంవత్సరం చివరలో అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టడం అంతగా మంచిది కాదు. పరిస్థితులు అనుకూలించవు.

సూర్యుని గోచారం బాగుండదు
శని గోచారం 12వ ఇంటిలో ఉండటంవల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీకు ఉపయోగపడుతుందా? లేదా? ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 మధ్య, జూన్ 15 నుంచి జూలై 17 మధ్య, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17 మధ్య కాలం మీకు ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు అనుకూలం కాదు. ఈ సమయంలో సూర్యుని గోచారం బాగుండదు. పెట్టుబడులకు, ఇతర ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు ఈ సమయం మంచిది కాదు