శనిగోచారం అనుకూలం

ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో మీరు ఉన్నతిని పొందడానికి అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు. అయితే పదోన్నతి పొందినప్పటికీ కార్యాలయంలో మీరంటే నచ్చని కొందరు వ్యక్తుల వల్ల ఆ పదవిని చేపట్టడానికి కొంత సమయం పడుతుంది. ఏప్రిల్ వరకు అడ్డంకులేర్పడతాయి. ఇటువంటి సమయంలో మీరు ఆవేశానికి గురికాకుండా సంయమనం పాటించడం మీకే మంచిది.

శారీకరశ్రమతోపాటు మానసిక శ్రమ కూడా..

శారీకరశ్రమతోపాటు మానసిక శ్రమ కూడా..

పై అధికారులు మీకు స్థాయికి మించిన పనులు ఇవ్వడంవల్ల శారీరక శ్రమతోపాటు మానసిక శ్రమ కూడా కలుగుతుంది. మీరు ఆసక్తిగా చేద్దామనుకున్న పనులన్నింటికీ అవాంతరాలు ఎదురవుతాయి. దీనివల్ల మీరు ఈ పనులను మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం, రాహు గోచారం ఒకటో ఇంటిలో ఉండటంవల్ల ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది.

గుర్తింపుతోపాటు విజయం సాధిస్తారు

గుర్తింపుతోపాటు విజయం సాధిస్తారు

గతంలో మీకు ఉన్న చికాకులు తొలగిపోవడమే కాకుండా, మీకు రావాల్సిన పదోన్నతి రావటం కానీ, లేదా అనుకున్న ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది. అలాగే ఈ సమయం విదేశాల్లో ఉద్యోగం చేద్దామనుకునే వారికి అనుకూలిస్తుంది. విదేశీయానానికి సంబంధించిన పనులు ఏప్రిల్ తర్వాత మీకు అనుకూలంగా పూర్తి కావడమే కాకుండా మీరు విదేశాల్లో స్థిరమైన ఉద్యోగాన్ని పొందటానికి అవకాశాలు దొరుకుతాయి. మీ వృత్తిలో గుర్తింపు పొందడటంతోపాటు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ఉన్నది వదిలిపెట్టవద్దు

ఉన్నది వదిలిపెట్టవద్దు

సంవత్సరాంతంలో గోచారం 12వ ఇంటికి మారడంవల్ల ఉద్యోగంలో, మీరు చేసే పనుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. ఏదో తెలియని ఆవేదన, అసంతృప్తి మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది. ఇటువంటి సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకున్నా కలిసిరావు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ఆలోచించి చేయడం మంచిది. మార్చి 15 మరియు ఏప్రిల్ 14 మధ్యకాలం, ఆగస్టు 17 మరియు సెప్టెంబర్ 17 మధ్యకాలం అలాగే నవంబర్ 17 నుంచి సంవత్సరాంతం వరకు ఉద్యోగ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి కొత్తది చేద్దామనుకునేవారు ఉన్నది వదిలిపెట్టకుండా ఉంటేనే ఉత్తమం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *