[ad_1]
ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడితే, చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. రక్తహీనతను నివారించడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ఆయుర్వేద వైద్యురాలు రేఖా రాధామణి సూచించారు. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
శొంఠి..
ఎండిన అల్లాన్ని శొంఠి అంటారు. రక్తహీనతను, ఐరన్ లోపాన్ని దూరం చేయడానికి శొంఠి సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యురాలు రేఖా రాధామణి అన్నారు. శరీరం ఐరన్‌ను శోషించుకోవడానికి అల్లంలోని పోషకాలు సహాయపడుతాయి. ఇది ఎనిమియా ట్రీట్మెంట్‌లో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీరు శొంఠి పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే.. రక్తహీనత దూరం అవుతుంది.
ఉసిరి నెయ్యి..
ఐరన్ లోపాన్ని నివారించడానికి, శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఉసిరి, నెయ్యి తీసుకోవాలని ఆయుర్వేద వైద్యురాలు రేఖా రాధామణి సూచించారు. భోజనానికి ముందు ఒక చెంచా ఉసిరి పొడిని ఒక చెంచా నెయ్యితో కలిపి తినాలని డాక్టర్ చెప్పారు. ఉసిరి, నెయ్యిలోని పోషకాలు.. ఐరన్ లోపాన్ని దూరం చేస్తాయి.
ఎండుద్రాక్ష, బెల్లం..
రక్తహీనత చికిత్సకు ద్రాక్షరిష్ట సిరప్‌ను తీసుకోవచ్చని డాక్టర్ సూచిస్తున్నారు. రక్తహీనతను నయం చేయడానికి భోజనం తర్వాత 15 మి.లీ. బెల్లం, ఎండుద్రాక్ష సిరప్ తీసుకోవాలని అన్నారు.
కిస్‌మిస్..
ఇనుము లోపం ఉన్న వారికి కిస్‌మిస్ దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. వంద గ్రాముల కిస్‌మిస్‌లో 1.9 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇది రోజూ కావాల్సిన దానిలో పదిశాతం.. రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఐరన్‌తో పాటు మరెన్నో పోషకాలను ఉన్న కిస్‌మిస్‌లతో తీపి తినాలన్న కోరికను కూడా అదుపు చేసుకోవచ్చు.
నువ్వులు..
నల్ల నువ్వులు ఐరన్ లోపాన్ని దూరం చేస్తాయని డా. దీక్షా భావ్సర్ అన్నారు. నువ్వులలో ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్ బి6, ఫోలేట్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు, నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు తీసుకుంటే మంచిది. వంద గ్రాముల నువ్వుల్లో ఏకంగా 14.6 శాతం ఐరన్ ఉంటుందట. అంటే రోజూ తీసుకోవాల్సిన ఐరన్‌లో దాదాపు ఎనభై శాతం.
డ్రైఫ్రూట్స్..
ఎండిన టొమాటోలు, అల్‌బుకారా, పీచ్, ప్రూన్స్, ఆప్రికాట్స్.. ఇలా ఎండిన పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ అందుతుంది. ఈ పండ్లోలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రోజూ వీటన్నింటినీ కలిపి కనీసం ఒక్క సర్వింగ్ తీసుకుంటే మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link