Tuesday, May 17, 2022

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ డెలివరీలు అక్టోబర్ 21, 2020వ తేదీన అధికారికంగా ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకూ కేవలం 3 నెలలో వ్యవధిలోనే 10,000 యూనిట్ల హైనెస్ సిబి350 మోడళ్లను విక్రయించినట్లు హెచ్ఎమ్ఎస్ఐ పేర్కొంది.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ కేవలం హోండా ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే లభ్యమవుతూనే ఈ అరుదైన అమ్మకాల రికార్డును సాధించడం. రెగ్యులర్ హోండా టూవీలర్ డీలర్‌షిప్ కేంద్రాల మాదిరిగా ప్రీమియం హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్ కేంద్రాలు అన్నిచోట్లా అందుబాటులో ఉండవు.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

ఎంపిక చేసిన నగరాలు, ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రీమియం హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా హైనెస్ సిబి350 అత్యధిక కస్టమర్ బేస్‌ను దక్కించుకోగలిగింది. ఒకవేళ ఈ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ హోండా టూవీలర్ డీలర్‌షిప్‌లలో కూడా లభించినట్లయితే, ఈ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

ఏదేమైనప్పటికీ, హోండా ఈ ఏడాది మార్చ్ నాటికి దేశవ్యాప్తంగా తమ బిగ్‌వింగ్ డీలర్‌షిప్ కేంద్రాలను 50కి విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. దీని ఫలితంగా, ఈ మోటార్‌సైకిల్ మరింత ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. హోండా తమ హైనెస్ సిబి350 వెయిటింగ్ పీరియడ్‌ను కూడా తక్కువగా ఉంచేందుకు మరియు కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

హోండా హైనెస్ సిబి350 ఈ విభాగంలో ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్‌కి పోటీగా నిలుస్తుంది. ఇది డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో దీని దరలు రూ.1.86 (ఎక్స్-షోరూమ్) లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

హోండా తమ ఐకానిక్ ‘సిబి’ డిఎన్‌ఏతో ఈ కొత్త హెచ్‌నెస్ సిబి350 మోటార్‌సైకిల్‌ను రెట్రో-మోడ్రన్ డిజైన్‌తో తయారు చేసింది. ఇందులో గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్, టర్న్ ఇండికేటర్స్, గుండ్రటి సైడ్ మిర్రర్స్ మరియు పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్‌ ఉంటాయి.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

ఈ మోటార్‌సైకిల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్‌కు కావల్సిన డేటాను అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి ‘హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్’ కూడా ఉంటుంది.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

ఇంజన్ విషయానికి వస్తే, హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్‌లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. ఇందులో డిస్క్ బ్రేకులు ఉంటాయి, ఇవి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఈ కొత్త హోండా బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా..

మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం నాలుగు హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మూడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఒకటి ఉన్నాయి. మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే ఈ మోటార్‌సైకిల్‌ను టెస్ట్ రైడ్ చేసి రివ్యూ చేసింది. – హోండా హైనెస్ సిబి350పై మా అభిప్రాయం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe