ఈ చిన్న అలవాట్లతో.. మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!

[ad_1]

Habits To Increase Memory: మనలో చాలా మంది చిన్నిచిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. అసలు విషయం గుర్తు పెట్టుకోవడానికి వీలు లేకుండా కొంతమందికి మతిమరుపు వస్తే ఎన్నో చిక్కులు ఎదురవుతాయి. పిల్లలు చదివిన విషయం మర్చిపోతే.. పెద్దవాళ్లు చేయాల్సిన పనులు గుర్తు లేకపోతే ఎన్నో చిక్కులు ఎదురవుతాయి. . సాంకేతికత పెరిగిన కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. దగ్గరవారి పుట్టిన రోజు గుర్తించుకోవడానికీ.. చాలా మంది రిమైండర్‌లపై, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లపై ఆధారపడుతుంటారు. చిన్నచిన్న విషయాలు మర్చిపోతే.. మీ అలవాటు అల్జీమర్స్, డిమెన్షియా, వంటి తీవ్రమైన వ్యాధులకు లక్షణం కావచ్చు. ఈ నేపథ్యంలో మీ జ్ఞాపకశక్తిని సకాలంలో మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. మనం జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడే చిట్కాల గురించి వివరిస్తూ.. డా. ప్రియాంక సెహ్రావత్‌ (Dr. Priyanka Sehrawat, MD Med, DM Neurology (AIIMS Delhi)) తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ఓ వీడియో షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌లో మన బ్రెయిన్‌పై ప్రభావం చూపే అలవాట్ల గురించి చెప్పారు.

రోజూ 7 గంటల నిద్ర అవసరం..

-7-

మన జాపకశక్తి పెరగడానికి.. నిద్ర చాలా అవసరం. మన రాత్రి నిద్రపోయే సమయంలో.. న్యూరాన్‌ల మధ్య కనెక్షన్‌లు (సినాప్సెస్ అని పిలుస్తారు) మీకు ఇకపై అవసరం లేని జ్ఞాపకాలను తొలగించడానికి పని చేస్తాయి. రాత్రి సమయంలో సినాప్సెస్ మరుసటి రోజు కొత్త జ్ఞాపకాలను రూపొందించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. పెద్దలు రోజుకు కనీసం పెద్దలకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సిఫర్సు చేస్తున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి..

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ప్రతిరోజూ వ్యాయమం చేయాలని డా. ప్రియాంక సెహ్రావత్‌ సూచించారు. వర్కవుట్‌ కారణంగా.. శరీరంతో పాటు మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వ్యాయామం వల్ల.. మెదడు మెరుగ్గా పనిచేస్తుంది, జాపకశక్తి మెరుగుపడుతుంది.

రోజూ ఏదొక కొత్త విషయం నేర్చుకోండి..

రోజూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇది మీ మీ మనస్సును నిమగ్నం చేయడానికి సహాయపడుతుంది. ఇలా చేస్తే.. మీ మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి పనిచేస్తుంది.

మల్టీ టాస్క్‌ చేయవద్దు..

బిజీబీజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా.. మల్టీ టాస్కింగ్ పెరిగిపోయింది. మల్టీ టాస్కింగ్ వ్యక్తులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. కానీ, మర్టీ టాస్కింగ్‌ కారణంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీరు ఒకే సమయంలో రెండు పనులు చేసినప్పుడు, మీ ఏకాగ్రత డివైడ్‌ అవుతుంది. దీనివల్ల మీ జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది.

పోషకాహారం తీసుకోండి..

మెదడు సరిగ్గా, ప్రభావవంతంగా పనిచేయడానికి తగిన పోషకాహారం అవసరం. మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ బ్రెయిన్‌ యాక్టివ్‌గా పనిచేయడానికి.. వాల్‌నట్‌లు, బ్రోకలీ, పసుపు, డార్క్ చాక్లెట్ , టమాటా, గుడ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు, టమాటా వంటి ఆహార పదార్థాలు మీ డైట్‌లో చేర్చుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *