వాహనదారులు ఏ ప్రదేశానికి వెళ్లినా టైర్లు అకస్మాత్తుగా పంక్చర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందిపడవలసి ఉంటుంది. కావున టెక్నాలజీ అమితంగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో వాహనదారులు కొత్త రకమైన వాహనాలను కోరుకుంటున్నారు. భారతదేశంలో చాలా కంపెనీలు టైర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో ఒకటి ఈ సియాట్ కంపెనీ.

భారతదేశంలో సియాట్ కంపెనీ బైకులు, ఆటో మరియు కార్లతో సహా వివిధ వాహనాల కోసం టైర్లను తయారు చేసి విక్రయిస్తుంది. కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో పంక్చర్-సేఫ్ టైర్లను కూడా విక్రయిస్తుంది. సియాట్ ఇప్పుడు దాని పంక్చర్ సేఫ్ టైర్ గురించి వివరిస్తూ కొత్త ప్రకటన వీడియోను విడుదల చేసింది.
MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి ఈ వీడియోలో కనిపిస్తాడు. ఈ వీడియోలో సియాట్ టైర్ల పంక్చర్ సేఫ్ స్ట్రెంత్ గురించి మాట్లాడుతాము. సంస్థ ఇటీవలే రానా దగ్గుబాటిని తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇప్పుడు వారు కొత్త వీడియోను విడుదల చేశారు.

ఈ ప్రకటన దక్షిణ భారతదేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది. ఈ వీడియోను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రకటన ఇప్పుడు ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చూపబడుతోంది.
MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు
ఈ వీడియోలో, సినీనటుడు రానా దగ్గుబాటిని కీల్వాలే బాబా అని పిలుస్తారు. ఈ ప్రకటనలో వారు పదునైన చీలలు ఉన్న రహదారిపై ద్విచక్ర వాహనం నడపడం చూడవచ్చు. ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సియాట్ టైర్లు బోలుగా ఉన్నాయి. కావున ఆ పదునైన సూదుల వంటి రహదారిలో ప్రయాణించేటప్పుడు ఏర్పడే రంద్రాలు తనకు తానుగా మూసివేసుకుంటాయి.

సియాట్ కంపెనీ తమ టైర్లు చాలా సురక్షితంగా ఉంటాయి, మరియు ఫంక్షర్ కాకుండా ఉండటానికి ఇవి అనుకూలంగా ఉంటాయి అని తెలియజేయడానికి ఈ వీడియో విడుదల చేసింది. ఏది ఏమైనా ఈ టైర్లు వాహనదారులకు చాలా సౌకర్యంగా ఉంటాయి. తరచుగా జరిగే ఫంక్షర్ నుంచి ఈ టైర్లు విముక్తి కలిగిస్తాయి.
MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!