PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ డ్రింక్స్‌ ఖాళీ కడుపుతో తాగితే.. బరువు తగ్గడంతో పాటు, శరీరంలో చెత్త తొలగుతుంది..!


Detox Drinks: పేలవమైన జీవనశైలి, చెడు ఆహార అలవాట్లు, అనారోగ్యాల కారణంగా మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. మన బాడీలో టాక్సిన్స్‌ ఎక్కువైతే.. శరీర భాగాల పనితీరుపై ప్రభావం పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి, శరీరాన్ని క్లీన్‌ చేయడం చాలా అవసరం. డీటాక్సిఫికేషన్‌ మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. బాడీ డీటాక్సిఫికేషన్‌ హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, నిద్రను మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. డిటాక్సిఫికేషన్‌ శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. డీటాక్సిఫికేషన్‌ కిడ్నీలు, లంగ్స్‌‌, లివర్‌ వంటి ముఖ్యమైన అవయవాల్లో పేరుకున్న వ్యర్థాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కొన్ని డిటాక్స్‌ డ్రింక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి తోడ్పడతాయి. ఇవి టాక్సిన్స్‌ తొలగించడానికే కాదు, కేలరీలను తగ్గించి, బరువ తగ్గడానికీ సహాయపడతాయి.

వట్టివేరు డ్రింక్‌..

వేసవి కాలం ప్రారంభం కాబోతుంది. మన బాడీని కూల్‌ చేసే డ్రింక్స్‌ మనం ఎక్కువగా ప్రిఫర్‌ చేస్తూ ఉంటాం. మన శరీరాన్ని కూల్‌ చేయడానికి వట్టివేరు డ్రింక్‌ అద్భుతంగా పని చేస్తుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. ఇవి సహజసిద్ధంగా విష వ్యర్థాలు, విష సూక్ష్మక్రిములతో పోరాడుతుంది. వెట్టివేరులో ఐరన్, మాంగనీస్, విటమిన్ బి6 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడతాయి. వట్టి వేరు డ్రింక్‌ తాగితే శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగుతాయి. ప్రతి రోజు ఉదయం వట్టివేరును నీళ్లలో మరిగించి.. ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు వెళ్తాయి, బరువు కూడా తగ్గుతారు. నిద్రలేమి సమస్య నుంచీ ఉపశమనం లభిస్తుంది. వట్టివేరులోని యాంటీసెప్టిక్ గుణాలకు లివర్‌, కిడ్నీలోని వ్యర్థాలను ఫిల్టర్‌ చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ డ్రింక్‌ బరువు తగ్గడానికీ సహాయపడుతుంది.

Also Read: వట్టివేరు డ్రింక్‌తో.. డీహైడ్రేషన్ తరిమికొట్టండిలా..‍‌!

ధనియాల టీ..

ధనియాల టీ..

ధనియాల టీ జీర్ణఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ధనియాలలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ధనియాలలో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఎ, కె , సి పుష్కలంగా ఉంటాయి. ధనియాలు.. మూత్రవిసర్జనకు సహాయపడతాయి. ఇవి శరీరంలో పేరుకున్న టాక్సిన్స్‌ను మూత్రం ద్వారా తొలగిస్తాయి. ధనియాలు.. జీవక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే.. ఫైబర్‌ కడుపును నిండుగా ఉంచుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఇది మీరు రాత్రి 1 గ్లాస్‌ నీటిలో 2 చెంచాల ధనియాలు వేసి నానబెట్టిండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే మంచిది. ధనియాల టీ తాగిన తర్వతా.. వర్కవుట్‌ చేస్తే శరీరంలోని వ్యర్థాలన్నీ చెమట ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

Also Read: ఈ వాటర్‌ తాగితే.. శరీరంలోని చెత్త అంతా క్లీన్ అవుతుంది..!

జీలకర్ర, నిమ్మరసం..

జీలకర్ర, నిమ్మరసం..

జీలకర్ర శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. గట్‌ ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలోని అదనపు క్యాలరీలను బర్న్‌ చేస్తుంది. జీలకర్రలోని గుణాలు.. శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తాయి. జీలకర్రలో పొటాషియం, కాల్షియం, కాపర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాత్రి పూట ఒక గ్లాస్‌ నీటిలో 1 స్పూన్‌ జీలకర్ర వేసి నానబెట్టి. ఉదయాన్నే మరిగించి ఫిల్టర్‌ చేయండి. అది గోరువెచ్చగా అయిన తర్వతా, నిమ్మరసం వేసి ఖాళీకడుపుతో తాగండి.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క జీవక్రియలను యాక్టివ్‌ చేస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలోని గుణాలు.. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. .ఇవి ఆకలిని నియంత్రిస్తాయి,బరువు తగ్గడంలో తోడ్పడతాయి. దాల్చిన చెక్కలో విసెరల్ కొవ్వును కరిగిస్తుంది. జలుబు, అలర్జీలను నివారిస్తుంది. దాల్చిన చెక్కలోని యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు.. మూత్రాశయ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఔషధంలా పనిచేస్తాయి.

మెంతులు..

మెంతులు..

మెంతులలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, ప్రొటీన్‌, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా మెంతులలోని సపోనిన్లు, ఫైబర్‌ జీర్ణక్రియకు మేలు చేస్తాయి. మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని వ్యర్థాలను.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *