ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారికి.. గుండె సమస్యలు వచ్చే రిస్క్‌ ఎక్కువ..!

[ad_1]

Authored by Rajiv Saranya | Samayam Telugu | Updated: 20 Dec 2022, 1:39 pm

Blood Group And Diseases: మనలో మ్యాక్సిమమ్‌.. O+, O-, A+, A-, B+, B-, AB+, AB- ఈ 8 రకాల బ్లడ్ గ్రూపుల్లో ఒకటి ఉంటుంది. ప్రతీ బ్లడ్‌ గ్రూప్‌ దాని సొంత లక్షణాలు ఉంటాయి. చాలా మంది బ్లడ్‌ గ్రూప్‌ తెలిస్తే… రక్తం దానం చేయడానికి, అవయవ దానం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా.. మనకు వచ్చే వ్యాధుల ముప్పును ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

 

Blood Group And Diseases: మనలో మ్యాక్సిమమ్‌.. O+, O-, A+, A-, B+, B-, AB+, AB- ఈ 8 రకాల బ్లడ్ గ్రూపుల్లో ఒకటి ఉంటుంది. ప్రతీ బ్లడ్‌ గ్రూప్‌ దాని సొంత లక్షణాలు ఉంటాయి. చాలా మంది బ్లడ్‌ గ్రూప్‌ తెలిస్తే… రక్తం దానం చేయడానికి, అవయవ దానం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. మన బ్లడ్‌ గ్రూప్‌ ఏమిటో తెలిస్తే.. మనకు వచ్చే ఆనార్యోగాల ముప్పును కూడా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. Webmd ప్రకారం, O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. మిగిలిన బ్లడ్ గ్రూపుల వారికంటే వీరికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా.. మనకు వచ్చే వ్యాధుల ముప్పును ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

గుండె జబ్బులు..

O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తక్కువ. అదే సమయంలో.. A, B, AB బ్లడ్‌ గ్రూప్‌ వారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. O బ్లడ్‌ గ్రూప్‌ వారికి.. అధిక కొలెస్ట్రాల్, అధిక మొత్తంలో గడ్డకట్టే ప్రోటీన్‌‌ ఉండే అవకాశం ఇతరల కంటే.. తక్కువగా ఉండటం వల్ల వీరికి గుండె సమస్యల ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

పెప్టిక్ అల్సర్..

NCBI ప్రకారం, పెప్టిక్ అల్సర్ మన కడుపులో, ఎగువ ప్రేగు లైనింగ్‌లో వచ్చే పుండు. O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి పెప్టిక్ అల్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. మీది O బ్లడ్ గ్రూప్ అయితే.. ముందుగానే అల్సర్‌‌ నివారణకు జాగ్రత్తలు తీసుకుండి.

కడుపు క్యాన్సర్‌..

పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం A, AB మరియు B బ్లడ్ గ్రూప్‌ల వారికి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి, టైప్ A ఉన్నవారికి ఈ రిస్క్‌ ఇంకా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. H. పైలోరీ ఇన్‌ఫెక్షన్ A బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా కడుపులో కనిపించే బ్యాక్టీరియా. వాపు, పూతలకి కారణమవుతుంది. దీనితో పాటు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.

స్ట్రెస్‌‌‌‌‌‌‌‌‌..

మీరు ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవుతున్నారా? అయితే, మీ బ్లడ్ గ్రూప్‌ కూడా దానికి కారణం కావచ్చు. మన శరీరంలో ఒత్తిడి హార్మోన్న కార్టిసాల్ స్థాయిలు పెరిగితే.. ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ హార్మోన్లు టైప్ A ఉన్నవారిలో ఎక్కువగా ఉంటాయి. అందుకే.. టైప్‌ A బ్లడ్‌ గ్రూప్‌ వారికి స్ట్రెస్‌ ఎక్కువగా ఉంటుంది.

వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం..

కాళ్ల వెయిన్స్‌లో రక్తం గడ్డకడితే.. వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం (VTE) వచ్చే అవకాశం ఉంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే.. ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉంది. టైప్ A, B, AB బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల్లో వెయిన్స్‌ త్రాంబోఎంబోలిజం రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

షుగర్‌..

ఈ రోజుల్లో షుగర్‌ వ్యాధి సాధారణం అయిపోయింది. మన బ్లడ్‌ గ్రూప్‌ కూడా.. డయాబెటిస్‌ రిస్క్‌ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. A, B బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారికి.. . టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రోక్‌..

స్ట్రోక్ ఒక ప్రాణాంతక వ్యాధి. కొన్నిసార్లు ఇది ఎటువంటి లక్షణాలు లేకుండా వస్తుంది.సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. మీ బ్లడ్ గ్రూప్ AB అయితే, స్ట్రోక్ వచ్చే ప్రమాదం మిగిలిన వారి కంటే ఎక్కువగా ఉంటుంది. వేరే బ్లడ్‌ గ్రూప్స్‌ కంటే.. A రకం బ్లడ్‌ త్వరగా గడ్డకడుతుందని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *