PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ మ్యాజికల్‌ ఆయిల్‌ రాస్తే.. కీళ్ల నొప్పులు మాయం అవుతాయ్..!


Ayurvedic Oil For Joint Pain: సాధారణంగా.. కీళ్ల నొప్పులు ఎక్కువగా పెద్దవారిలోనే చూస్తూ ఉంటాం. అయితే.. ప్రస్తుత రోజుల్లో . చిన్న వయసు వారిలోనే ఈ సమస్యలు స్టార్ట్‌ అవుతున్నాయి. . చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య ఇంకా బాధాకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పుల కారణంగా లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ స్థాయిలు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా.. కీళ్ల నొప్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. శరీరం చుట్టుపక్కల గాలి ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు కీళ్ల చుట్టూరా కండరాలు, కండర బంధనాలు, ఇతర కణజాలాలు ఎక్స్‌ప్యాండ్‌ అవుతాయి. ఇది కీళ్ల మీద ఒత్తిడిని పెంచుతుంది. ఇంట్లో కూర్చిని ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆయుర్వేద నిపుణురాలు డా. ఈలా.. మనకు మ్యాజికల్‌ ఆయిల్‌ షేర్‌ చేశారు. కీళ్ల నొప్పులు, కీళ్ల స్పిఫ్‌నెస్‌ నుంచి ఉపశమనం పొందడాని ఈ ఆయిల్‌ సహాయపడుతుంది డాక్టర్‌ అన్నారు. కీళ్ల నొప్పులను మాయం చేసే.. ఈ ఆయిల్‌ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆయిల్‌

ఇలా తయారు చేసుకోండి..

ఆయిల్‌ తయారు చేసుకోవడానికి..

  • ఆవాల నూనె – 20-30 ml
  • వెల్లుల్లి రెబ్బలు – 6- 8
  • కరివేపాకు – 6- 10 తీసుకోవాలి..

ఆవాల నూనె, వెల్లుల్లి, కరివేపాకు ఒక పాత్రలో తీసుకుని మరిగించండి. వెల్లుల్లి రెబ్బలు గోధుమ రంగులోకి వచ్చే వరకు 10 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత.. మంట ఆపి, చల్లార్చండి. మీకు నొప్పి ఉన్న చోట ఈ నూనె అప్లై చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. రోజు ఇలా చేయడం వల్ల.. కొద్ది రోజుల్లోనే నొప్పి మాయం అవుతుంది. ఈ ఆయిల్‌తో మొత్తం శరీరం మసాజ్‌ కూడా చేసుకోవచ్చు.

ఆవ నూనె..

ఆవనూనెలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఆవ నూనెలో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఆర్థరైటిస్, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులను ఉపశమం పొందడానికి ఆవ నూనె సహాయపడుతుంది. ఆవ నూనెలో ఉండే.. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్‌ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వాపును తగ్గించి.. నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఆవ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల కండరాలు, కీళ్ళు నొప్పి తగ్గుతాయి.

వెల్లుల్లి..

వెల్లుల్లిలోని పోషకాలు ఎముకలలో కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల, ఎమకలు దృఢంగా మారతాయి. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిక్ ప్రభావాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే.. కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించడంలో వెల్లుల్లి సమర్థవంతంగా పని చేస్తుంది.

కరివేపాకు..

మోకాళ్లలో వాపు వల్ల కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. అటువంటి పరిస్థితిలో, కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను, ఇన్ఫెక్షన్లను నుంచి రక్షిస్తాయి.

వ్యాయామం..

ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. రోజూ వ్యాయామం చేస్తే కీళ్లనొప్పుల సమస్యను దూరం చేసుకోవచ్చు. మీకు సూచ్‌ అయ్యే వ్యాయామం గురించి తెలుసుకోవడానికి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.





Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *