Tuesday, September 21, 2021

ఈ రోజు ఏ భారతీయుడూ మర్చిపోలేడు: పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ, వీరజవాన్లకు నివాళి

National

oi-Rajashekhar Garrepally

|

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిని ఏ భారతీయుడూ మర్చిపోలేడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

భారత సైనికులు తమ ధైర్యసాహసాలతో నేటి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాలకు భారత ప్రజలంతా ఘన నివాళులర్పిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించిన ప్రధాని మోడీ.. దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ ట్యాంక్ ‘అర్జున్'(మార్క్ 1ఏ)ను ఆర్మీ అధిపతి జనరల్ ఎంఎం నరవణేకు అందజేశారు.

అంతేగాక, చెన్నైలో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. తమిళ రచయిత, కవి సుబ్రమణియా భారతిని గురించి ఆయన ప్రస్తావించారు. ‘ఆయుధాలు తయారు చేద్దాం, కాగితం తయారు చేద్దాం, కర్మాగారాలు చేద్దాం, పాఠశాలలు చేద్దాం, వాహనాలు తయారు చేద్దాం, ఓడలు తయారు చేద్దాం” అని అన్నారు. సుబ్రమణియా భారతి దృష్టితో ప్రేరణ పొందిన భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి భారీ ప్రయత్నం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

భారత సైనికులు మనదేశ భద్రతకు కోసం చూపుతున్న ధైర్యసాహసాలు దేశ పౌరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మాతృభూమి కోసం వారు చేస్తున్న త్యాగాలను మరువలేమని అన్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మన జవాన్లకు అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. ప్రధానితోపాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పుల్వామా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పుల్వామాలో రెండేళ్ల క్రితం ఇదే రోజున సీఆర్పీఎఫ్ జవాన్ల వాహన శ్రేణిపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అమరులైన జవాన్లకు రాజ్ నాథ్ సింగ ఆదివారం నివాళుర్పించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తున్నాను.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘మన బంగారు భవిష్యత్ కోసం పూల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మీ త్యాగాలు ఎప్పటికే మాకు ఆదర్శమే’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు దేశం రుణపడి ఉంటుందని అన్నారు.

2019, ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై జేషే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసందే. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత ఇందుకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్‌లోని బాలాకోట్ జైషే ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్టైక్స్ జరిపింది. ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.


Source link

MORE Articles

Alzheimer’s Disease: इस लाइलाज बीमारी की शुरुआत में मिलने लगते हैं ये संकेत, तुरंत उठाएं ये कदम

Alzheimer's Day: 21 सितंबर को पूरे विश्व में वर्ल्ड अल्जाइमर डे (World Alzheimer's Day 2021) के रूप में मनाया जाता है. यह एक...

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ...

Salesforce invests in Indian fintech unicorn Razorpay

The funding may have pushed Razorpay's valuation to over US$3 billion, Livemint reported. Source link

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe