ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ ZEE, Tata Motors, LIC

[ad_1]

Stock Market Today, 10 November 2023: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా రేంజ్ బౌండ్‌లో కొనసాగాయి, గురువారం స్వల్పంగా నష్టపోయాయి.

పడిపోయిన US స్టాక్స్
US 30-సంవత్సరాల బాండ్ల వేలంతో ట్రెజరీ ఈల్డ్స్‌ పెరిగాయి. దీంతోపాటు, ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కూడా అమెరికన్‌ ఈక్విటీ మార్కెట్లకు మింగుడు పడలేదు. దీంతో, నాస్‌డాక్, S&P 500 కోసం సుదీర్ఘ లాభాల పరంపరలను ముగించి, గురువారం నష్టాల్లో ముగిశాయి. డో జోన్స్‌ 0.68%, S&P 500 0.81%, నాస్‌డాక్ 0.94% పతనమయ్యాయి. 

ఆసియా షేర్లు పతనం
వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చని జెరోమ్ పావెల్ హెచ్చరించడంతో ఆసియా స్టాక్‌ మార్కెట్లు పడిపోయాయి. దీనివల్ల స్టాక్స్‌, బాండ్లలో ర్యాలీని తగ్గి, పెట్టుబడిదార్లు డాలర్‌ వైపు అడుగులు వేస్తారు.

ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 40 పాయింట్లు లేదా 0.21 శాతం రెడ్‌ కలర్‌లో 19,381 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: LIC, ONGC, కోల్ ఇండియా, M&M, ఐషర్ మోటార్స్, BSE, హిందాల్కో. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

టాటా మోటార్స్: టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ మీద సానుకూల దృక్పథాన్ని కొనసాగించిన రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌, కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను “B1” నుంచి “Ba3”కి అప్‌గ్రేడ్ చేసింది.

ZEE: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ (ZEEL), 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో, ఏకీకృత నికర లాభంలో 9% వృద్ధితో రూ. 123 కోట్లను మిగుల్చుకుంది.

అరబిందో ఫార్మా: జులై-సెప్టెంబర్‌ కాలంలో అరబిందో ఫార్మా రూ.757 కోట్లు లాభపడింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.7,219 కోట్లుగా ఉంది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.3 (300%) మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది.

ICICI బ్యాంక్‌: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో, ICICI సెక్యూరిటీస్ ICICI బ్యాంకుకు సంపూర్ణ అనుబంధ సంస్థగా (wholly owned subsidiary) మారింది.

ముత్తూట్ ఫైనాన్స్‌: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ముత్తూట్ ఫైనాన్స్ రూ.991 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం రూ.1858 కోట్లుగా ఉంది.

టొరెంట్ పవర్: సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి టోరెంట్ పవర్ రూ.526 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.6,961 కోట్లకు చేరింది.

RVNL: సెప్టెంబర్‌ క్వార్టర్‌లో RVNL రూ.394 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. కార్యకలాపాల ద్వారా రూ.4,914 కోట్ల ఆదాయం వచ్చింది.

అదానీ పోర్ట్స్‌: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (APSEZ), సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.1,761.63 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది, ఇది, 1.37% YoY వృద్ధి. ఆదాయం రూ.6,951.86 కోట్లుగా ఉంది.

అశోక్ లేలాండ్: ఉత్పత్తుల విస్తరణ కోసం రూ.1,200 కోట్ల పెట్టుబడిని అశోక్ లేలాండ్ ప్లాన్ చేస్తోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: 24k, 22k వద్దట – 18 క్యారెట్ల నగలే ముద్దట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *