Thursday, June 17, 2021

ఈ విజయం టీఆర్ఎస్‌కే అంకితం… ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై సురభి వాణీ దేవి రియాక్షన్…

Telangana

oi-Srinivas Mittapalli

|

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుపై టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ దేవి సంతోషం వ్య‌క్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజ‌యం టీఆర్ఎస్‌కే అంకిత‌మ‌ని చెప్పారు. తానెవ‌రో తెలియ‌క‌పోయినా వారి ఇంటి ఆడ‌ప‌డ‌చులా భావించి.. తన విజ‌యం కోసం పాటుప‌డిన పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు రుణ‌ప‌డి ఉంటానని చెప్పారు. తనకున్న అనుభవంతో విద్యారంగంలో,ఉద్యోగ రంగంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు.

బీజేపీ నేత రామచంద్రరావు సురభి వాణీ దేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఓటమిపాలైనప్పటికీ నైతిక విజయం మాత్రం బీజేపీదేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని ఆరోపించారు.ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్లకు డబ్బులు పంపిణీ చేశారని… ఉద్యోగ సంఘాల నేతలను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. డబ్బు పంపిణీ,బెదిరింపులు,ప్రలోభాలతోనే టీఆర్ఎస్ ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు.

bjp leader ramachandra rao reaction over his defeat in mlc elections

ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఉద్యోగులకు పీఆర్సీ,ఫిట్‌మెంట్ ప్రకటించి టీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో మూడేళ్లుగా అమలుచేయని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లపై సరిగ్గా ఎన్నికల వేళ ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని వారిని బెదిరింపులకు గురిచేశారని… టీఆర్ఎస్‌కు ఓటేయకపోతే పీఆర్సీ,ఫిట్‌మెంట్,ప్రమోషన్లు ఉండవని బెదిరించారని ఆరోపించారు.

సాధారణ ఎన్నికలను మించి ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం జరిగిందని రామచంద్రరావు ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్య,మధ్యతరగతి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం కలగానే మిగిలిపోతుందన్నారు. దాదాపు రూ.200కోట్లు టీఆర్ఎస్ ఖర్చు పెట్టిందన్నారు. ఇంత డబ్బును సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టినా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల వేళ సామాజికవర్గాల మధ్య కూడా చిచ్చు పెట్టారని ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీకి ఫేస్ వాల్యూ లేకనే పీవీ నర్సింహారావు కుమార్తెను పోటీలో పెట్టారని అన్నారు. ఈ విజయం టీఆర్ఎస్ విజయం కాదని,పీవీ కుమార్తె విజయం గానే చూడాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తం 3,56,000 ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ కేవలం 8వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచిందన్నారు. రానున్న రోజుల్లో మరింత కసిగా పనిచేస్తామని చెప్పారు. అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ,ఇటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ రెండు చోట్ల కాంగ్రెస్ గల్లంతయిందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఫలితాలు నిరూపించాయన్నారు. 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌పై పలు ఆరోపణలు చేశారు. డబ్బు పంపిణీ,అక్రమాలు,అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందన్నారు.


Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe