పల్చటి కురులతో( Thin Hair ) బాధపడుతున్నారా.? జుట్టును దట్టంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా.? ఒత్తైన కురుల కోసం రకరకాల కేశ ఉత్పత్తులను వాడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం గురించి తెలుసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి.ఎందుకంటే ఈ సీరం కొత్త జుట్టు ఎదుగుదలకు మద్దతు ఇస్తుంది.మీ జుట్టును రెండింతలు చేస్తుంది.మరి ఇంతకీ ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.
ఆపై అందులో ఒక గ్లాసు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకుని.నానపెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా అందులో వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు మందారం పువ్వులు( Hibiscus ) వేసి చిన్న మంటపై దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి రెండు నిమిషాల పాటు మిక్స్ చేశారంటే మన సీరం అనేది రెడీ అవుతుంది.ఈ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ సీరం ను తయారు చేసుకుని వాడారంటే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో కొత్త జుట్టు ఎదుగుదల మొదలవుతుంది.కురులు దట్టంగా మారతాయి.పైగా ఈ సీరం ను ఉపయోగించడం వల్ల హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.హెయిర్ సూపర్ స్ట్రాంగ్ అండ్ షైనీగా కూడా మారుతుంది.కాబట్టి ఒత్తైన దృఢమైన జుట్టును కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న న్యాచురల్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
