Feature
oi-Garikapati Rajesh
తెలుగు
నూతన
సంవత్సరాన్ని
ఉగాది
పర్వదినంగా
జరుపుకుంటాం.
జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
12
రాశులవారి
జీవితం
ఈ
పండగ
నుంచి
కొత్తగా
ప్రారంభమవుతుంది.
రాశుల
ఫలితాలు
ఎలా
ఉంటాయి?
లాభమా?
నష్టమా?
అని
తెలుసుకునేందుకు
పండితులు
పంచాంగ
శ్రవణం
చేస్తారు.
మిథున
రాశివారికి,
కర్కాటక
రాశివారికి
ఈ
నూతన
సంవత్సరంలో
ఎలా
ఉంటుందో
తెలుసుకుందాం..

మిథునరాశి
మిథునరాశి
వారికి
ఆదాయం
2గా
ఉంటే
వ్యయం
11గా
ఉంది.
రాజపూజ్యం
2,
అవమానం
4
అదృష్టయోగం
50
శాతం
ఉంది.
కష్టపడి
పనిచేయడంతోపాటు
ఆదాయానికి
మించిన
ఖర్చులుంటాయి.
ఉద్యోగంలో
ఉన్నవారికి
అధికార
యోగం..
వ్యాపారంలో
ఉన్నవారికి
ఎదుగుదల..
విదేశాల్లో
అవకాశాలు
లభిస్తాయి.
గృహానికి
సంబంధించి,
భూమికి
సంబంధించి
వీరికి
ఈ
ఏడాదిలో
మంచి
యోగం
ఉంది.
ఏప్రిల్
22వ
తేదీన
ఉగాది
పర్వదినం.
ఆ
తర్వాత
రోజు
నుంచి
అదృష్ట
యోగం
ఉంటుంది.
ఇంట్లో
శుభకార్యాలు
జరుగుతాయి.
గురు
శ్లోకాలు
చదువుకుంటే
ఆపదల
నుంచి
పూర్తిగా
గట్టెక్కొచ్చు.
ఏ
విషయాన్ని
పట్టుకొని
పూర్తిగా
తెగేదాకా
లాగొద్దు.
కొంతలోనే
వదిలేయండి.
కష్టం
ఎక్కువైనా
శని
భాగ్యస్థానంలో
ఉండటంతో
మంచి
ఫలితాలను
పొందుతారు.
అక్టోబరు
31వ
తేదీ
వరకు
ఏకాదశ
స్థానంలో
రాహువు
సంపూర్ణ
శుభాలను
కలిగిస్తున్నాడు.
కేతు
సంచారం
వల్ల
ఈ
రాశివారికి
మానసిక
సమస్యలు
తలెత్తుతాయి.
దానికి
నివారణగా
గురువుకు
సంబంధించిన
స్లోకంతోపాటు
కేతువు
శ్లోకాన్ని
పఠించాలి.
ఈ
ఏడాది
మిథున
రాశివారికి
అన్నిచోట్లా
మంచి
గుర్తింపు
లభిస్తుంది.

కర్కాటకరాశి
కర్కాటకరాశివారికి
ఆదాయం
11గా
ఉంటే
వ్యయం
8గా
ఉంది.
రాజపూజ్యం
5,
అవమానం
4
ఈ
ఏడాది
కర్కాటకరాశివారి
ఆర్థిక
పరిస్థితి
అద్భుతంగా
ఉంటుంది.
అదృష్టయోగం
75
శాతంగా
ఉంది.
అందరికీ
ఈ
ఏడాది
వారివారి
పనుల్లో
కార్యశుద్ధి
లభిస్తుంది.
పెట్టుబడులు
వృద్ధి
చెందడంతోపాటు
వ్యాపారస్తులకు
బాగా
కలిసి
వస్తుంది.
వీరికి
ఎంత
కలిసివస్తుందో
అదే
స్థాయిలో
ఉద్యోగస్తులకు
మంచి
ఫలితాలున్నాయి.
అష్టమ
శనిదోషంవల్ల
గుర్తు
తెలియని
అనారోగ్య
పరిస్థితులు
ఎదురైనప్పటికీ
23వ
తేదీ
నుంచి
గురువు
మంచి
ఫలితాలను
ప్రసాదిస్తాడు
కానీ
అవన్నీ
పూర్తిగా
శ్రమతో
కూడుకున్నవే
అవుతాయి.
కర్కాటక
రాశివారికి
శని
అష్టమంలో
ఉండటంవల్ల
తీవ్రమైన
మానసిక
ఒత్తిడి
కలుగుతుంది.
దీన్ని
నివారించేందుకు
శని
శ్లోకం
చదవాలి.
ఈ
ఏడాది
అక్టోబరు
వరకు
మిశ్రమంగా
ఉండే
కేతువు
నవంబరు
నుంచి
వీరికి
మంచి
ఫలితాలను
ప్రసాదిస్తాడు.
అక్టోబరు
31వ
తేదీ
వరకు
దశమంలో
ఉన్నరాహువు
నవంబరు
నుంచి
మాత్రం
విఘ్నాలు
కలిగిస్తాడు.

English summary
Let’s find out what will happen to Gemini and Cancer this New Year.
Story first published: Wednesday, March 22, 2023, 12:11 [IST]