మిథున రాశి:
మిథునరాశివారికి ఈ ఏడాది ఏర్పడే మహాయోగం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సూర్యుడు, బృహస్పతి మీ రాశి జాతకానికి సంబంధించి మంచి స్థానలో ఉన్నారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి లభ్యమవడంతోపాటు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమయంలో పిల్లల అభివృద్ధిలో పురోగతి ఉంటుంది. వ్యాపారం చేసేవారు వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు మరికొన్ని కొత్త బాధ్యతలు తీసుకుంంటారు. అన్నివిధాలుగా ఈ సమయం కలిసి వస్తుంది.

వృషభ రాశి:
ఈ రాశి వారి దశ తిరగబోతోందని చెప్పవచ్చు. వీరి జాతకంలో ఇప్పటికే గురుడు 5వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అందుకే ప్రేమ వివాహాలకు గురు, శుక్రుల కలయిక మంచిది. కొత్త భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించడంతోపాటు వీరి ప్రేమ జీవితం బాగుంటుంది. అదే సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుందని చెప్పవచ్చు.

ధనుస్సు రాశి:
ఉగాది నుండి ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే వీరి జాతకంలో 4వ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల ఆదాయం రెట్టింపవడమే కాదు.. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యక్తిగతంగా అందరినీ ఆకట్టుకోవడంతోపాటు వారికి పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది

సింహ రాశి:
ఈ సింహ రాశి వారికి అరుదైన రాజయోగం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుంచి 8వ ఇంట్లో బుధాదిత్య, గజకేసరి రాజయోగాలు రూపొందుతున్నాయి. దీనివల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగడంతోపాటు వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. పరిశోధన రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలమని చెప్పవచ్చు.