Tuesday, April 13, 2021

ఉత్తరాఖండ్ జలప్రళయం -సొరంగంలో చిక్కుకున్న 16 మందిని కాపాడిన ఐటీబీపీ


National

oi-Madhu Kota

|

ఉత్తరాఖండ్‌లో.. సముద్రమట్టానికి 7,108అడుగుల ఎత్తువరకు విస్తరించి ఉన్న నందాదేవి హిమానినదం(మంచు పర్వతం లేదా గ్లేసియర్) ఒక్కసారిగా బద్దలుకావడం, మంచు చరియలు విరిగి పడడంతో ధౌలి గంగా నదిలో జలప్రళయం సంభవించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసు (ఐటీబీపీ) ఆధ్వర్యంలో సహాచక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని జోషిమఠ్ ప్రాంతంలో వాతావరణం సంక్లిష్టంగా ఉండే చోట రిషిగంగ పేరుతో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, ఒక్కసారిగా పోటెత్తిన వరదలో ప్రాజెక్టు, మరో మూడు వంతెనలు కొట్టుకుపోయాయి. జలప్రళయం దెబ్బకు రేనీ- తపోవన్‌ వద్ద ఉన్న పవర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిగా ధ్వంసమైంది. పవర్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్లు ఐటీబీపీ అధికారులు చెప్పారు. కాగా,

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగం

Uttarakhand glacier burst: ITBP rescues all 16 people trapped in Tapovan tunnel

ఇప్పటి వరకు 10 మృతదేహాలను గుర్తించగా, పవర్ ప్రాజెక్టు టన్నెల్ లో చిక్కుకుపోయిన 16 మందిని ఐటీబీపీ బలగాలు కాపాడాయి. మిగతావారి జాడకోసం గాలిస్తున్నామని అధికారులు చెప్పారు. గల్లంతైన వారంతా బహుశా మరణించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వరద పోటెత్తిన ధౌలి గంగానది.. గంగకు ఉపనది కావడంతో అది ప్రయాణించే మార్గాల్లోని అన్ని ఊళ్లలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు

చమోలి వరదల నేపథ్యంలో తెహ్రీ డ్రామ్ నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. రిషిగంగ, అలకానంద నదుల్లో పెరుగుతున్న జలాల ప్రవాహానికి మార్గం సుగమం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. నదుల ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని అన్ని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. అలకానంద ప్రాజెక్టులో నీటి ప్రవాహం సాధారణ స్థాయిలో ఉందన్నారు.Source link

MORE Articles

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

नवरात्रि के व्रत में अगर खाएंगे ये चीजें तो नहीं होंगे डिहाइड्रेशन के शिकार

नवरात्रि शुरू हो गए हैं. इन दिनों बहुत से लोग नौ दिनों तक व्रत रखते हैं. इन दिनों मां दुर्गा के नौ स्वरूपों...

పసుపు కండువాతో Jr.NTR : టీడీపీ పగ్గాలకు రెడీ – ట్రిపుల్ ఆర్ ద్వారా సంకేతాలు..?

పసుపు కండువా తలకట్టుతో జూనియర్.. ఈ పరిస్థితుల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందటే విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ఉగాది లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe