​Pumpkin seeds: గుమ్మడి కాయతో.. దప్పలం, సూప్‌, కూర, స్వీట్‌ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి పారేస్తుంటాం. కానీ, గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ , ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్‌ ఫినోలిక్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. తరచూ.. గుమ్మడి గింజలు తీసుకుంటే.. అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

​Pumpkin seeds:

ఈ పోషకాలు ఉంటాయి..

మన శరీరానికి అవసరమైన పోషకాలతో గుమ్మడి గింజలు నిండి ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, సి, ఇ, బీటా కెరోటిన్, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, జింక్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్‌ ఇ యాంటీఆక్సిడెంట్‌, ఇది ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీర కణాలను కాపాడుతుంది. బీటా కెరోటిన్‌ చర్మాన్ని సంరక్షిస్తుంది, వాపును తగ్గిస్తుంది. ​

PCOS: ఈ గింజలు రోజూ ఒక స్పూన్‌ తింటే.. పీసీఓఎస్‌ లక్షణాలు తగ్గుతాయ్..!
(image source – pixabay)

గుండెకు మేలు చేస్తాయి..

గుండెకు మేలు చేస్తాయి..

గుమ్మడికాయ గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైటోస్టెరాల్స్‌, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెంచుతాయి. గుమ్మడి గింజలు రక్తంపీహెచ్‌ను క్రమబద్ధం చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యాంగా ఉంటుంది.

(image source – pixabay)

జీర్ణక్రియకు తోడ్పడుతాయి..

జీర్ణక్రియకు తోడ్పడుతాయి..

ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహించే ముఖ్యమైన పోషకం. గుమ్మడి గింజల్లో కరిగే, కరగని ఫైబర్ రెండు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఫైబర్‌ పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, గ్యాస్‌ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గిస్తుంది.​

Habits To Be Changed: ఈ అలవాట్లు మార్చుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం..!

క్యాన్సర్‌‌‌‌‌‌కు చెక్‌..

క్యాన్సర్‌‌‌‌‌‌కు చెక్‌..

గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. గుమ్మడి గింజలు తీసుకుంటే.. గ్యాస్ట్రిక్‌, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మంచి నిద్రకు సహాయపడతాయి..

మంచి నిద్రకు సహాయపడతాయి..

గిమ్మడిగింజలు.. ట్రిప్టోఫాన్ అద్భుత మూలం. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్‌గా మారుతుంది. ఈ రెండు న్యూరోట్రాన్స్మిటర్లు విశ్రాంతిని, నిద్రను ప్రోత్సహిస్తాయి. మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే.. రోజూ ఉదయం ఒక స్పూన్‌ గుమ్మడి గింజలు తీసుకోండి.

(image source – pixabay)

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది..

గుమ్మడి గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి అవసరం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రోజూ మీ బ్రేక్‌ఫైస్ట్‌లో గుమ్మడి గింజలు తీసుకుంటే.. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల భారిన పడే ముప్పును తగ్గించవచ్చు. (image source – pixabay)

ఎనర్జీ బూస్టర్‌..

ఎనర్జీ బూస్టర్‌..

గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్లు, హెల్తీ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఇవి ఎనర్జీ లెవెల్స్‌ని పెంచడానికి సరైన ఆహారం అని చెప్పొచ్చు. మీరు రోజును యాక్టివ్‌గా గడుపడానికి ఉదయం పూట ఆహారంలో గుమ్మడిగింజలు తీసుకోండి. (image source – pixabay)

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..

గుమ్మడి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది.​

Kidney Health: ఈ హెర్బల్‌ టీలు తాగితే.. కిడ్నీలు క్లీన్‌ అవుతాయ్‌..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *