[ad_1]

Salary TDS: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. TDS ఎంత కట్ అవుతుంది? దీని గురంచి ఎవరిని అడగాలి? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. దీనిపై క్లియర్ వ్యవస్థాపకుడు & CEO అర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. జీతం నుంచి TDS కట్ అయిన వ్యక్తులందరూ TDS రిటర్న్‌లను దాఖలు చేయడం తప్పనిసరి అన్నారు. ప్రతి త్రైమాసికానికి TDS రిటర్న్‌ను సమర్పించాల్సి ఉందన్నారు. ఇందుకు TAN, PAN, TDS తగ్గించబడిన మొత్తం వివరాలు అదించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206AA ప్రకారం, మీరు డిడక్టర్‌కు పాన్ కార్డు వివరాలు అందించకపోతే నిబంధనల మేరకు 20% శాతం లేదా అంతకంటే ఎక్కువ TDS కట్ అవుతుంది.

జీతంపై TDS ఎలా లెక్కిస్తారు?
సెక్షన్ 192 ప్రకారం, జీతం చెల్లింపు సమయంలో TDS మినహాయించబడుతుంది. యజమాని జీతం చెల్లిస్తున్నప్పుడు కట్ అయ్యే TDS, వచ్చే నెల అడ్వాన్స్, లేదా ఆ నెలకు సంబంధించినది, గడచిన నెల బకాయి అయ్యి ఉండొచ్చు. అంచనా వేతనం.. ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువ లేకపోతే TDS కట్ అవదు. PAN కార్డు లేని వారికి కూడా ఇది వర్తిస్తుంది.

ముందుగా ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగి జీతాన్ని సంబంధిత యజమాని అంచనా వేస్తారు. ఇందులో బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్, ఎంప్లాయర్ మంజూరు చేసిన పెర్క్విసైట్‌లు, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ, మీల్ కూపన్‌లు మొదలైన ఇతర అలవెన్సులు, ఈపీఎఫ్, బోనస్, కమీషన్‌లు, గ్రాట్యుటీ ఆధారంగా ఉద్యోగి జీతాన్ని లెక్కిస్తారు. ఆ తరువాత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 కింద మినహాయింపులను గణిస్తారు. మినహాయింపులు HRA, ప్రయాణ ఖర్చులు, యూనిఫాం ఖర్చులు, పిల్లల ఫీజ్ అలవెన్సులు మొదలైన వాటికి వర్తిస్తాయి. వృత్తిపరమైన పన్ను, వినోద భత్యం, స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 తగ్గించవచ్చు.

ఉద్యోగి జీతం నుంచి యజమాని ఇలాంటి వాటి అన్నింటిని కట్ చేసిన తరువాత మిగిలే దానిని పన్ను చెల్లించదగిన జీతంగా పరిగణిస్తారు. ఒక వేళ ఉద్యోగి ఇతర ఆదాయాల గురించిన సమాచారాన్ని అందిస్తే (ఉదాహరణలు ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడు వచ్చే రెంట్, బ్యాంకు డిపాజిట్లు మొదలైనవి) వాటిని పన్ను చెల్లించదగిన వేతనం కింద చేరుస్తారు. హౌసింగ్ లోన్‌లపై చెల్లించే వడ్డీని ఇంటి ఆస్తి ఆదాయం నుంచి తొలగిస్తారు. ఇటువంటివి అన్నీ చేరికలు, తీసివేతలు అయ్యాక లెక్కించిన మొత్తం ఉద్యోగి మొత్తం స్థూల ఆదాయం అవుతుంది.

ఉద్యోగి సమర్పించిన ఇన్వెస్ట్‌మెంట్ డిక్లరేషన్ ఆధారంగా యజమాని లేదా సంస్థ ఆదాయపు పన్ను చట్టంలోని VI-A అధ్యాయం కిందకు వచ్చే పెట్టుబడులను తగ్గిస్తారు. డిక్లరేషన్‌లో PPF, ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్, ELSS మ్యూచువల్ ఫండ్స్, NSC, సుకన్య సమృద్ధి ఖాతా వంటి పెట్టుబడుల మొత్తాలు ఉండవచ్చు. అలాగే ఆదాయం నుంచి చెల్లించే గృహ రుణాలు, జీవిత బీమా ప్రీమియంలు, NSC, సుకన్య సమృద్ధి ఖాతా చెల్లింపులు ఉండవచ్చు. అలాగే సెక్షన్ 80D, 80G, మొదలైన అనేక ఇతర విభాగాల కింద యజమాని మినహాయింపులను అనుమతిస్తారు.

ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి కొత్త పన్ను విధానం అమలులలోకి వచ్చింది. దాని ప్రకారం పన్ను రేట్ల టాక్స్ కాలుక్యులేషన్ ఉంటుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే ఆ విషయాన్ని యజమాని లేదా సంస్థకు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న పన్ను విధానం ప్రకారం యజమాని అతని/ఆమె ఆదాయపు పన్నును తీసివేయవచ్చు. కొత్త పన్ను విధానంలో అయితే ఎక్కవ మినహాయింపులు ఉండవు.

TDS తగ్గింపు రేటు
సెక్షన్ 192 TDS రేటును పేర్కొనలేదు. పన్ను చెల్లింపుదారులకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం TDS తీసివేయబడుతుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో యజమాని లేదా సంస్థ పన్ను గణనను చేస్తారు. ఉద్యోగి ఆర్థిక సంవత్సరంలో పని చేసిన నెలలను బట్టి TDS తీసివేయబడుతుంది. పాన్ కార్డు లేని ఉద్యోగులకు 20% TDS, 4% సెస్‌ ఉంటుందని గుప్తా చెప్పారు.

[ad_2]
Source link
Leave a Reply