[ad_1]
ఎన్నిరకాల ఉప్పులు..
కొన్ని ఉప్పు రకాలు అయోడిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి కలయికతో తయారవుతాయి. సాధారణంగా టేబుల్ సాల్ట్ అయోడిన్‌తో తయారవుతుంది.
సాధారణంగా ఉప్పు చాలా రకాలుగా ఉంటుంది. రాళ్ళ ఉప్పు, నిమ్మ ఉప్పు, పింక్ సాల్ట్, టేబుల్ సాల్ట్ ఇలా చాలా రకాలుగా ఉంటుంది. రాళ్ళ ఉప్పుని ప్రాసెస్ చేసి టేబుల్ సాల్ట్‌లా తయారు చేస్తారు. దీని వల్ల కొన్ని పోషకాలు పోతాయి.
ఉప్పు ఎలా తయారవుతుంది..
సహజంగా దొరికే సముద్రపు ఉప్పుని 1200 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద వేడి చేసి తయారు చేస్తారు. ఉప్పుని వేడి చేసిన ప్పుడు అందులోని ముఖ్య ఖనిజాలు దూరమై అది టేబుల్ సాల్ట్‌గా మారుతుంది.
టేబుల్ సాల్ట్‌లో..
సాధారణంగా మార్కెట్లో దొరికే ఉప్పులో సింథటిక్ కెమికల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంతమంచివి కావు. కొన్నిసార్లు విషపూరితంగా కూడా మారతాయి.
ఉప్పులో సహజ అయోడిన్ అనేది ప్రాసెస్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. దీంతో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. జీవక్రియ సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది అయితే, ఉప్పు తయారు చేసేటప్పుడు సింథటిక అయోడిన్‌ని కలుపుతున్నారు.
Also Read : Sexual Health : ఇలా చేస్తే శృంగార సమస్యలు దూరమవ్వడంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ సేఫ్..
రంగు..
సహజంగా దొరికే ఉప్పు తెల్లగా ఉండదు. దీనిని ప్రాసెస్ చేసి బ్లీచ్‌తో కలర్ వేసి అమ్ముతున్నారు.
సాధారణ టేబుల్ సాల్ట్ తినడం వల్ల కణజాలంలో అదనపు ద్రవం ఏర్పడి గౌట్, కిడ్నీలో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు, ఆర్థరైటిస్, రుమాటిజంకు కారణమవుతుంది.
Also Read : Hug Day 2023 : ఇష్టమైన వారిని ఎందుకు హగ్ చేసుకోవాలంటే..
ఫుడ్ ఐటెమ్స్‌లో..
కేవలం ఉప్పు తగ్గిస్తే సరిపోదు. కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్‌లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. బ్రెడ్స్, సాస్, మసాలాలు, చిప్స్, సూప్స్, ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ అన్నింటిలోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటికి దూరంగా ఉండడం మంచిది.
Also Read : Abdominal Pain : పొత్తికడుపులో నొప్పి వస్తుంటే ఈ సమస్య ఉందేమో చెక్ చేసుకోండి..
సమస్యలు..
టేబుల్ సాల్ట్‌లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవి అసలు ఉండకూడదు. అల్యూమినియం హైడ్రాక్సైడ్ సాధారణంగా ఉప్పులో వాడతారు. ఇది అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది.
వాపు, కాలేయ సమస్య, రక్తపోటు, గుండెజబ్బులు, కండరాల తిమ్మిర్లు, పక్షవాతం, హార్ట్ ఫెయిల్యూర్, ఎడెమా, పీఎమ్‌ఎస్, డిప్రెషన్ వంటి సమస్యలు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తాయి.
టేబుల్ సాల్ట్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీ శరీరాన్ని ఉప్పుకి అలవాటు పడకుండా కూడా చూసుకోవడం మంచిది.
గుండె సమస్యలు..
సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఈ హైపర్ టెన్షన్ కారణంగా గుండెసమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీ గుండె మీ శరీరమంతటా రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది.
అయితే, సహజంగా సముద్రపు ఉప్పు టేబుల్ సాల్ట్‌తో పోల్చితే మంచిది. ఇందులోని ఖనిజాలు.. మన సోడియం, పొటాషియం నిష్పత్తులను బ్యాలెన్స్ చేసి హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఎలక్ట్రోలైట్ సమతుల్యతని కాపాడతాయి.
థైరాయిడ్..
నిజమైన ఉప్పు మనం తినే ఆహారం నుండి పోషకాలను సేకరించే సహాయపడే జీర్ణ ఎంజైమ్స్‌ని పెంచుతుంది. వీటితో పాటు థైరాయిడ్, ఇమ్యూనిటీ, అడ్రినల్ పనితీరును మెరుగుపరిచే ఖనిజాలు కూడా సముద్రపు ఉప్పులో ఉంటాయి.
అతిగా వద్దు…
అయితే, రాళ్ళ ఉప్పు మంచిది కదా అని ఎక్కువగా తినకపోవడమే మంచిది. సరైన మోతాదులోని తినాలి. ఎక్కువగా తింటే లేనిపోని సమస్యలు వస్తాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply